అంతా షాక్..!ఏలీయన్స్ ఉన్నారా? అయితే ఎక్కడ ఉన్నారు.

ఎలియన్స్ మన విశ్వంలోనే ఎక్కడో ఎదో గ్రహం మీద ఉంటారని భావిస్తూ వస్తున్న మనకి ఇది కొంత షాకింగ్ విషయంగానే కనిపిస్తోంది.మన భూతల విశ్వంలో మన లాంటి జీవులు ఎక్కడైనా ఉంటాయా ? అనేది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. మన విశ్వంలో మనలాంటి జీవుల గురించి మానవుల అన్వేషణ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. కానీ, ఎక్కడా ఇప్పటివరకూ మరో జీవరాశి జాడ కనిపించలేదు. ఈ లోపు ఎగిరే పళ్ళాలు అనీ ఎలియన్స్ అనీ ఎక్కడో ఒకచోట ఎదో హడావుడి కనిపిస్తోనే ఉంది. ఎలియన్స్ ఉన్నారంటూ ఇటీవలి కాలంలో అమెరికా పరిశోధకులు స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు ఎలియన్స్ అనబడే జీవుల గురించిన సమాచారం కోసం అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఎలియన్స్ కు సంబంధించి కొత్త విషయం తెలుస్తోంది. ఇంతవరకూ ఎలియన్స్ ఉన్నారనీ అయితే, వాళ్ళు సముద్ర గర్భంలో ఉన్నారని కొత్త వాదన తెరమీదకు వచ్చిన అమెరికా పరిశోధకులు.

Alsoread:గుడ్ న్యూస్..! ప్రతి నెల ఈ‌ఎం‌ఐ కట్టలేక ఇబ్బంది పడ్తున్నారా అయితే మీ కోసమే ఈ వార్త.

ఈ సరి కొత్త వాదనలపై ఇంటర్నేషనల్ కోయిలేషన్ ఫర్ ఎక్సట్రా టెర్రస్ట్రీయల్ రీసెర్చ్ (ఐసీఈఆర్‌) ఉపాధ్యక్షుడు గేరీ హసెల్‌టినెవ్‌ వివరణ ఇచ్చారు. ఎలియన్స్ స్పేస్ నుంచి రావు.. సముద్ర గర్భం నుంచి వస్తాయని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దీనికి ఆయన కొన్ని ఉదంతాలు ఉదాహరణగా చెబుతున్నారు. ఈయన చెబుతున్న దాని ప్రకారం ఎలియన్స్ సముద్ర గర్భంలోని పర్వత లోయలోని చీలికల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవి మానవులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ ఫ్లయింగ్ సాసర్లు సముద్రం పైనే ఎగురుతూ ఎక్కువగా కనిపించాయని చెబుతున్నారు. అంతేకాదు.. మనకు మన మధ్యలోనే ఉన్న సముద్రం గురించి 5 శాతం మాత్రమే తెలుసు. సుదూరంలో ఉన్న అంతరిక్షం గురించి ఎంతో తెలుసు. మన దృష్టి అంతా అంతరిక్షంపైనే ఉంది. కానీ, ఎలియన్స్ మాత్రం సముద్రగర్భంలోనే ఉన్నారు. అంటూ ఘంటాపధంగా టినేవ్ చెబుతున్నారు.

Alsoread: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? అయితే మారిజువానా ఉచితం గా ఇస్తాం,మత్తులో తేలిపోండి.

ఈ మధ్య కాలంలో 50 ఏళ్ల బ్రిటిష్ మహిళ తన జీవితంలో 52 కన్నా ఎక్కువ సార్లు గ్రహాంతరవాసులచే అపహరించబడిందని పేర్కొంది! మిర్రర్ యుకె ప్రకారం, పౌలా స్మిత్ తన మొదటి గ్రహాంతర అనుభవం 6 సంవత్సరాల వయసులో జరిగిందని, అప్పటి నుండి ఆమె 50 కన్నా ఎక్కువ సార్లు అపహరించబడిందని చెప్పారు. ఇవన్నీ నిజమో కాదో తెలీదు కానీ, ఇటీవలి కాలంలో మాత్రం ఎలియన్స్ పై ఎక్కువగా ప్రపంచం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ట్రంప్ ఎలియన్స్ ఉన్నాయనే పరిశోధనల్లో తేలిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. అంతేకాదు..కొన్ని విషయాలను బయటపెట్టలేమంటూ ఈ సందర్భంగా వీరు వ్యాఖ్యానించాడమూ ఎలియన్స్ విషయంలో ప్రపంచానికి తెలియని ఎదో అంశం దీనిపై పరిశోధనలు చేస్తున్న 27 దేశాలకు తెలిసి ఉండవచ్చనే అనుమానాలు బలపరుస్తోంది.కొత్తగా ఎలియన్స్ కి సంబంధించిన కథనాలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Alsoread:బాత్ రూంలో స్నానం ఎంత సేపు చేస్తారు ? 16 గంటల తరువాత ఏం జరిగింది.