Summer special cool drink: మనం తినే ఆహారంలో పెరుగు తినాలా ,మజ్జిగ తినాలా అనేది చాలామందికి సందేహం ఉంది .వెనకటి రోజుల్లో ఇంట్లో జనాభా ఎక్కువగా ఉండేవారు కాబట్టి పెరుగు సరిపోదని మజ్జిగ చేసుకుని తినేవాళ్లు, అలాగే మజ్జిగ చేసినప్పుడు వచ్చే వెన్నతో నెయ్యి చేసి అమ్మేవారు. పెరుగు పిల్లలు అడుగుతారేమో అని పెరుగు తింటే వేడి చేస్తుంది ,అని మజ్జిగ తింటే చలవ చేస్తుందని పెద్దవాళ్ళు చెప్పేవారు
ఆచారంగా మనం కూడా ఫాలో అవుతున్నాం .వెనకటి రోజుల్లో కూరల వండుకోవడానికి డబ్బులు లేక ఎక్కువగా అన్నం మజ్జిగతో తినేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు మజ్జిగ తినడం కంటే పెరుగు తినడం మంచిది .మజ్జిగలో మనం ఎక్కువ శాతం నీటిని కలుపుతాము రెండు మూడు రకాల కూరలతో తిని చివరగా పెరుగు వేసుకుంటాము.
తినేది కొంచమే కాబట్టి పెరుగు వేసుకోవడం మంచిది పెరుగు కూడా తీయటి పెరుగు కాకుండా పుల్లగా ఉన్న పెరుగు వాడటం మంచిది .పుల్లగా ఉన్న పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది .ఇది మనకి మేలు చేస్తుంది. అలాగే పుల్లటి పెరుగును ఉప్పు నూనె లేకుండా ఉండే వంటలలో వేసి వండడం వల్ల రుచిగా ఉంటాయి. పుల్లటి పెరుగు ఆరోగ్యానికి మంచిది.