Increase Brain Power: చర్మం ఆరోగ్యంగా ఉండాలన్న ,అలాగే గోర్లు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఫీజ్ లివర్ ఆయిల్ని వాడుతుంటారు. కానీ ప్రకృతి విధానంలో బదులుగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న బ్లాక్ నట్స్, వాల్ నట్స్ హంప్ సీడ్స్ వాడొచ్చు. ఫిష్ లివర్ ఆయిల్ ని కార్డ్ ఫిష్ అనే ఫిష్ నుండి తయారు చేస్తారు. ఈ ఫిష్ యొక్క లివరు 250 గ్రామస్ ఉంటుంది. దీని నుంచి ఫిష్ లివర్ ఆయిల్ ని తీస్తారు.
దీనిని క్యాప్సిల్స్ లో ఉంచి వాడతారు. మనిషికి ఒక రోజుకి 1.1 గ్రామ్ నుంచి 1.6 గ్రామ్స్ ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ కావాలి .ఫిష్ ఆయిల్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒక క్యాప్సిల్ 30 రూపాయల వరకు ఉంటుంది .కానీ 100 గ్రామ్స్ బ్లాక్ నట్స్లో 13 గ్రాముల ఒమేగా త్రీ ఉంటుంది. అంటే ఒక ఐదు ఆరు గ్రాములు తీసుకుంటే మనకి సరిపోతుంది .ఇది ధర కూడా తక్కువగా ఉంటుంది.
అలాగే వాల్ నట్స్ జనపనార గింజలు వీటిలో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను వేయించుకొని తినవచ్చు. లేదా పొడిచేసుకుని వంటలలో వాడవచ్చు. ఇలా తక్కువ ఖర్చుతో వచ్చే ఈ గింజలను వాడటం వల్ల చర్మం గుండె గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఆకుకూరల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తుంది. ఫిష్ ఆయిల్ ని మాత్రమే వాడాల్సిన పనిలేదు.