ఈ కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారం!

ఈ కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారం!

మన పెద్దలు ప్రాంతం, కాలానుగుణంగా ఆహార నియమాలు మార్చుకునేవారు. అలాగే ఫ్యామిలీ లో వంశపారంపర్యంగా ఆహార నియమాలు సంక్రమిస్తూ ఉంటాయి. అనుకూలమైన ఆహారం తీసుకోవడం వల్ల జన్యుపరంగా మన శరీర తత్వానికి అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి ఆహారంతో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయి. పోషక లోపాలు తలెత్తకుండా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి చెక్కు చెదిరి పోకుండా ఉండాలన్నా జన్యుపరంగా అనుకూలమైన ఆహారం తీసుకోవాలి.మనకు ముందుగా అలవాటు లేని, సరిపడని ఆహారం తీసుకోవలసివస్తే, కాలేయం మీద అదనపు భారం పడుతుంది. Best food in covid-19 time for healthy body-fbhealthy.com

Alsoread: వాళ్ళు అంటే నాకు క్రష్ అంటున్న ధన్య బాలకృష్ణ.

మనము తినే ఆహారంలో విషపదార్థాలు (టాక్సిన్లు) ఉంటే, వాటిని కూడా కాలేయం వడగడుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు సరిపడని ఆహారం తీసుకుంటే కాలేయం పనితీరు దెబ్బతిని, జీవక్రియలు కుంటుపడి రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.ఏ ఆహారంతో అయితే ఊబకాయం సంక్రమిస్తుందో, ఏ ఆహారంతో శరీర బరువు తగ్గుతుందో ఆయుర్వేదంలో చెప్పలేదు. శరీరం పని చేయడానికి సహకరిస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు, లేదంటే అనారోగ్యంతో ఉన్నట్టు గ్రహించాలి. లావుగానో, సన్నగానో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భావించడం సరి కాదు. Best food in covid-19 time for healthy body-fbhealthy.com

Alsoread: మనల్ని కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే.

ఈ రోజుల్లో సంప్రదాయ ఆహారాన్ని పిల్లలు ఇష్టపడకపోవడానికి కారణాలు ఉన్నాయి. జంక్‌ ఫుడ్‌లో రుచిని పెంచే టేస్టింగ్‌ సాల్ట్‌ వంటివి వాడడం వల్ల పిల్లలు వాటిని తింటూ ఉంటారు. కాబట్టి హానికారకమైన జంక్‌ ఫుడ్‌ను మాన్పించి, పిల్లల చేత ఇంటి ఆహారం తినిపించేలా చేయడం తల్లితండ్రుల బాధ్యత. పిల్లలను సంప్రదాయ ఆహారం తినమని ఒత్తిడి చేయకుండా, ఈ ఆహారంలోని పోషక విలువలు, వాటితో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి, ఆహారం మీద మక్కువ పెంచాలి.

Alsoread: ఈ రాశి వారు జాగ్రత్త..!ఈ రాశి వారికి ఆకస్మిక ధనం వచ్చే అవకాశాలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *