తిరుమలలో భక్తుల సందడి.

వారాంతపు సెలవు ల కారణముగా శ్రీవారి తిరుమలకి తండోప తండాలు గా జనాలు కదలివచ్చారు. కరోనా కారణంగా టీటీడీ విధించిన ఆంక్షల గురించి అందరికీ తెలిసిన విషయమే,

ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి రావడం తో టీటీడీ విధించిన పలు రకాల ఆంక్షలు కొంత మేర సదలించడంతో అలిపిరి వద్ద భారీ వాహనాలు నిలిచిపోయాయి.

వారాంతంలో తిరుమలలో ఏ మూలాన చూసిన జనాలే కనిపించారు. టీటీడీ ప్రకారం ఒక్క ఆదివారం నాడు 80 వేల మందికి పైగా వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తుంది.