అసిడిటీ సమస్య మిమ్మల్ని బాధిస్తుందా? ఈ చిన్న రెమెడీ మీకు ఉపశమనం కలిగిస్తుంది.

ACIDITY: ఈ బిజీ జీవితంలో ఆకలి కడుపును నింపడానికి ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకుంటున్నాము. ఈ ఆహారం తీసుకునే విషయం లో చేసే చిన్న తప్పులే కడుపులో వచ్చే గ్యాస్ లేదా అసిడిటీ కి కారణం అవుతున్నాయి. ఈ అసిడిటీ బాధ నుండి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు వెతికినా సరైన ఫలితం ఉండదు.

పైగా ఈ సమస్యను పరిష్కారం కోసం వైద్యుల దగ్గరకు వెళ్తే మందులు మింగే బాధ తప్పడం లేదు. ఈ చిన్న రెమెడీ తో మీ అసిడిటీ బాధను పోగొట్టుకోండి. అసలు అసిడిటీ ఎలా వస్తుంది అంటే మనము ఆహారం తీసుకునే సమయంలో ఆహారం తో పాటుగా కొద్దిగా గాలి కూడా జీర్ణాశయం లోకి వెళ్తుంది. ఈ తిన్న ఆహరం జీర్ణం అయ్యే క్రమంలో గ్యాస్ గా మరి బయటకి త్రేనుపులు లాగా వస్తాయి.

అసిడిటీ ని పోగొట్టే రెమెడీ:

అసిడిటీ సమస్య ను తగ్గించుకోవడానికి ఆహారం తిన్న తరువాత గోరువెచ్చని నీటిని తీసుకోవడం వలన మంచి ఉపశమనం పొందవచ్చు. అసిడిటీ సమస్యను అల్లం పుదీనా కలిపిన నీరుని తీసుకోవడం వలన కూడా అసిడిటీ తగ్గే అవకాశం ఉంటుంది.

అసిడిటీ రాకుండా ఉండాలి అంటే నియమాలు:

ముఖ్యంగా అసిడిటీ సమస్యను తగ్గించుకోవడానికి చల్లని నీటిని తీసుకోకూడదు. ఈ సమస్య ఉన్న వారు పాలు, టీ వంటి వాటిని కూడా తీసుకోవడం మానేయాలి. కడుపులో ఎక్కువగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే బంగాళదుంప, ఉల్లిపాయలు, పాలకూర మసాలా పదార్ధాలు తీసుకోవడం మానేయలి. ముఖ్యంగా అహరం తీసుకునే సమయంలో మాట్లాడటం మానేయలి.