నీరసంగా అనిపిస్తుందా? అయితే చక్కటి చిట్కా ను పాటించండి.

నీరసంగా అనిపిస్తుందా? అయితే చక్కటి చిట్కా ను పాటించండి.

మనిషి శరీరం ఒక యంత్రం.. అది సరిగా పనిచేయాలి అంటే మంచి ఆరోగ్యాన్ని పెంపవదించుకోవాలి. అయితే ఏ రోజుల్లో కాస్త ఎక్కువనే ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాల్సిందే. ఆ యంత్రం ఎప్పుడు బలహీనపదుతుందో, ఎప్పుడు ధృడంగా ఉంటుందో ఎప్పుడు చెప్పలేం. అయితే చాలా మంది ఎప్పుడూ బలహీనంగా, నీరసంగా కనిపిస్తుంటారు. అయితే ఈ శరీరానికి మంచి ఆహారం అందించనప్పుడు అది బాలహీనపడుతుంది, మీరు తీసుకునే ఆహారంలో సరైన విటమిన్స్, పోషకాలు, ప్రోటీన్స్, అందకపోవడం వలన శరీరం బలహీనపడుతుంది.

ఈ బలహీనతని నీరసంగా చెప్పుకుంటాం,అయితే ఈ సమయంలో ఈ పని చేయాలన్న నీరసంగా ఉంది అంటుంటారు.నీరసంగా ఉన్న వారు పని చేసేటప్పుడు కాళ్లు లాగుతూ ఉంటాయి. పిక్కలలో నొప్పులు వస్తుంటాయి ఇక పని చేయడానికి శక్తి లేదు అనే భావనలో ఉంటారు.. శరీరంలో వచ్చే ఈ మార్పులను మనం నీరసం గా వ్యక్తం చేస్తుంటారు. నీరసానికి ముఖ్య కారణం సరైన పోషకాలు అందకపోవడం అని చెప్పవచ్చు. ఈ నీరసం నుండి అతి త్వరగా బయట పడటానికి నానబెట్టిన వేరుశనగ పప్పులు ,నానపెట్టిన జీడిపప్పులు, పుచ్చ గింజలు, పిస్తా పప్పులు ఇలాంటివి తినడం, మొలకెత్తిన విత్తనాలు తినడం చేస్తే మంచి బలం వస్తుంది.

తినే ఆహారంలో కొన్ని మార్పులు కూడా చేస్కోవాలి. అయితే పాలిష్ పట్టని ధాన్యాలు అన్నం గాను పుల్కాలుగాను చేసుకొని తినడం, కాస్త కూరలలో పప్పు రాజ్మా గింజలు సోయా చిక్కుడు గింజలు ఇలాంటివి వేసుకుని తినడం వల్ల మంచి బలం వస్తుంది. ప్రతి ఒక్కరూ భోజనం తర్వాత నువ్వుల ఉండలు వంటివి కాస్త వేరుశనగ పప్పుల ఉండలు ఇంకా కొన్ని రకాల గింజలతో చేసిన ఉండలు తీసుకోవడం వలన మంచి బలాన్ని ఇస్తాయి. ఈ రకమైన ఫిజికల్ నీరసాన్ని తగ్గించుకోవడానికి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇది చాలా సింపుల్ సొల్యూషన్ కానీ అసలైన నీరసం కొంతమందికి మరొకటి ఉంది.

ఇంకొకటి ఏమిటంటే మానసిక నీరసం, ఈ నీరసానికి వైద్యం త్వరగా ఉండదు, ఈ సమస్య కు మందు డాక్టర్ దగ్గర ఉండదు, మీ దగ్గరే ఉంటుంది. ఈ మనోనీరసాన్ని తగ్గించడానికి మీరు మీ పద్ధతిని మార్చుకోవడం తప్ప మరొక సొల్యూషన్ ఏమీ లేదు. ఈ మనోనీరసం అంటే ఏమిటంటే మనసులో వచ్చే నీరసానికి శరీరం కూడా వీక్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పిన ఫిజికల్ నీరసం అనేది బాడీలో ఉండవచ్చు కానీ మీ మైండ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది మీరు ఉత్సాహంగా ఉంటారు. కానీ ఈ నీరసం మానసిక నీరసం అనేది ఫిజికల్ గా కూడా నీరసం వచ్చేలాగా చేస్తుంది. అందుకని మానసికమైన నీరసమే అసలైన నీరసం అని చెప్పవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!