బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుర్వేద మందు

బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుర్వేద మందు

బుధవారం ఎర్రగడ్డలోని డా. బీఆర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలో ఆమె మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుర్వేదంలో రెండు ట్రీట్ మెంట్ పద్ధతులు ఉన్నాయని చెప్పారు. కరోనా బారిన పడి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా మారిన బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్)ను ఆయుర్వేద ట్రీట్ మెంట్ తో పూర్తిగా నివారించొచ్చని ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి వెల్లడించారు. రెండు ట్రీట్ మెంట్ పద్ధతులు, మందులు, వాటిని వాడేందుకు గైడ్ లైన్స్ ను విడుదల చేశారు. ఈ మందులను ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ డా. కరుణాకర్ రెడ్డి, ఆయుర్వేద అడిషనల్ డైరెక్టర్ డా. కే అనసూయ, డా. బూర్గుల రామక్రిష్ణారావు గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. పి శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు.  Ayurvedic medicine kills black fungus-fbhealthy.com

Alsroread: జూన్ 7 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు.

మొదటి చికిత్స విధానం:
1. గంధక రసాయనం మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనం తర్వాత వేసుకోవాలి.  2. ఖదిరాదివతి మాత్రలు రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు.. 
3. పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరు వెచ్చని పాలతో రెండు సార్లు భోజనానికి ముందు.. 
4. మృత్యుంజయ రసం రెండు మాత్రల చొప్పున రోజుకు మూడు సార్లు.. 
5. ఒక గ్రాము శుభ్ర భస్మాన్ని గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి. Ayurvedic medicine kills black fungus-fbhealthy.com

Alsoread: అలాంటి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం అంటున్న రష్మీక.

రెండో చికిత్స విధానం:
1. నారదీయ లక్ష్మీవిలాస రస్ -500 మిల్లిగ్రాములు. రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత
2. కైషార గుగ్గులు- 500 మిల్లిగ్రాములు. రోజుకు మూడు సార్లు భోజనం తర్వాత
3. సుదర్శన ఘనవటి -500 మిల్లిగ్రాములు. రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు
4. నిషా ఆమ్లకి -500 మిల్లిగ్రాములు. రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు.

Alsoread: బయటకు వస్తే వాహనాలు సీజ్‌….నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *