బలగం మూవీ చూడటానికి ఊరంత ఒక్కటైంది. ఆ ఊరు ఎక్కడో తెలుసా?

బలగం మూవీ చూడటానికి ఊరంత ఒక్కటైంది. ఆ ఊరు ఎక్కడో తెలుసా?

బలగం సినిమా మార్చి 3 న ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. జబర్దస్త్ కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి తొలివారంలో విడుదలై మొదటి రోజు నుంచి పాజిటీవ్‌ రివ్యూలు తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ మూవీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తుంది. అయితే ఈ మూవీ లో తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై మహా అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే ఇంత మంచి సినిమా ను అందించిన డైరెక్టర్ వేణుపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. బలగం మూవీ ఓటీటీలో విడుదలై ప్రజల ఆధరణ పొందింది.. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ రెండు ఇంటర్నేషన్‌ల అవార్డులను గెలుచుకుంది. ఇక బలగం మూవీ తాజాగా లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది.

ఈ మూవీ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. నాకు బలగం మూవీ కి ఇది మూడో అవార్డు.మన బలగం సినిమా ప్రపంచ వేదికపై మెరిస్తుంది. ప్రతిష్టాత్మక అవార్డు లాస్‌ ఏంజిల్స్‌ “సినిమాటోగ్రఫి” అవార్డును గెలుచుకున్నందుకు బలగం మూవీ సినిమాటోగ్రాఫర్‌ ఆచార్య డైరెక్టర్ వేణుకు అభినందనలు అని తన ట్విట్టర్‌ ఖాతాలో ఫోటోలు పంచుకున్నాడు.నిజానికి ఈ మూవీ తెలంగాణ పల్లె జీవనానికి అద్దం పట్టేలా తీశారని దర్శకుడు మరియు నిర్మాతపై ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే మొదటి సారిగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం చేపట్టి ఈ మూవీ అనే ఒక భావోద్వేగ సినిమా చేసిన విషయం తెలిసిందే.

బలగం మూవీ థియేటర్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. మరియు ఈ మూవీకి ఓ.టి.టి.లో కూడా ఎంతో ఆదరణ లభించింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ‘బలగం’ మూవీ ని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బూర్గుపల్లి, ఉప్పర మల్యాలలో వెనుకటి రోజుల్లోలాగా ప్రదర్శించారు. అయితే ఆ గ్రామంలో ఉండే వాళ్ళు, ముఖ్యంగా థియేటర్ కి రాలేని పెద్దవాళ్ళు కూడా సినిమా వీక్షించే విధంగా ఆ ఊరి గ్రామ పంచాయతీ ముందు, ఆయా గ్రామాల కూడళ్ల ముందు, పెద్ద పెద్ద స్క్రీన్ ల సాయంతో ప్రదర్శిస్తున్నారు. బలగం మూవీ ని ఓ.టి.టి అమెజాన్ ప్రైమ్ లో వస్తుండటం తో ఇలా గ్రామాల్లో ఎగబడి చూస్తున్నారంటే అదేమీ మాములు విషయం కాదు అని చెప్పవచ్చు.. ఈ మూవీ ఇంత హిట్ అయ్యి అందరి మన్ననలు పొందింది. దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *