వేసవి కాలంలో స్నానం చేయు సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఎంటో తెలుసా?

వేసవి కాలం వచ్చింది అంటే ఇంట్లో కూర్చున్న సరే సూర్యుని ఎండ ప్రభావానికి గురికాక తప్పదు. రోజు రోజు కి వేసవి తాపం పెరిగిపోతుండడం తో ప్రజలు ఉక్కపోత, చెమట తో సతమతం అవుతున్నారు. శరీరంలో నీటి శాతం పడిపోకుండా (డీహైడ్రేషన్ ) కాకుండా ఖచ్చితంగా నీటిని మరియు ఆహారాన్ని తీసుకోవాలి.

కొంత మందికి అయితే ఈ వేడి కి తట్టుకోలేక ఒకటి కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తుంటారు. ఇక ఉద్యోగం చేసే వాళ్ళ విషయము అయితే ఇక చెప్పనవసరం లేదు వీరు ఆఫీసు నుండి రాగానే స్నానం చేస్తారు. చాలా మంది ఉదయం సమయంలో తల స్నానం చేసి ఉద్యోగాలకు వెళ్తుంటారు.

ఉదయం సమయంలో కంటే సాయంత్రం సమయంలో తల స్నానం చేయడం వలన మంచిది అని నిపుణులు చెప్తున్నారు. సాయంత్రం సమయాలో తల స్నానం చేయడం వలన రోజంతా పని చేసిన అలసట తగ్గిపోతుంది, మరియు శరీరం పై పేరుకు పోయినా మట్టి, దుమ్ము, బ్యాక్టీరియా తొలగిపోతాయి.

శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. సాయంత్రo సమయంలో స్నానం అతి ఉత్తమం అని దీని వలన గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయి అని నిపుణులు చెప్తున్నారు.