పిల్లిని వెతికి ఇచ్చిన వారికి 30 వేల బహుమానం.

అనాది పిల్లులని కుక్కలను పెంచుకోవడం చూస్తూనే ఉన్నాము. కానీ ఆ పెంచుకున్న పెంపుడు జంతువులను కన్నా పిల్లలగా చూసుకునే వ్యక్తులు ఉన్నారు. వాటికి ఏ చిన్న ఆపద వచ్చిన తల్లడిల్లి పోయేవారు ఉన్నారు. హైదరాబాద్ టోలిచౌకీ ప్రాంతానికి చెందిన జరీనా గత 8 నెలల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ పిల్లికి జింజర్ అని పేరు కూడా పెట్టారు. గత నెల జూన్ 17వ తేదీన జింజర్ కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారు.ఆపరేషన్ తరువాత కొద్దిగా వాపు రావడంతో తిరిగి జూన్ 23వ తేదీన మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి లో ఉండగానే అకస్మాత్తుగా పిల్లి అక్కడి నుంచి ఎక్కడికొ వెళ్లిపోయింది. ఆ పిల్లిని ఎక్కడ వెతికినా దొరకలేదు.

Alsoread: Gpay చెల్లింపులు సురక్షితమేనా? ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది.

ఎంతో ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో జరినా తీవ్ర కలత చెందారు. నా పిల్లిని వెతికి తెచ్చిన వారికి రూ. 30 వేలు ఇస్తానని ఓ మహిళ ప్రకటించారు. ఇక ఎక్కడ వెతికినా పిల్లి దొరకకపోవడం తో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు కూడా ఇచ్చారు, అక్కడ వల్ల ఫిర్యాదు తీసుకోకపోవడం తో ఇక ఒక నిర్ణయానికి వచ్చింది. వీళ్ళు మీడియా ను కూడా ఆశ్రయించారు. తాము ముద్దుగా పెంచుకున్న పిల్లి జాడ చెప్పిన వారికి బహుమతి కూడా ఇస్తామని తెలిపారు.

Alsoread: ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

వాళ్ళు పిల్లి జాడ కోసం పిల్లి ఫోటోలతో కూడిన కరపత్రాలు కూడా పంచారు. ఇక ఎంతకి పిల్లి జాడ తెలికపోవడం తో మళ్ళీ జూన్ 27 న పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. మరియు మీడియా ను ఆశ్రయించి పిల్లి ఫోటోల కరపత్రాలతో మీడియా తో మాట్లాడుతూ తమ జింజర్ ని వెతికిచ్చిన వారికి 30వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.తను ప్రాణంగా పెంచుకున్న పిల్లిని తెచ్చివాలని కోరారు.

Alsoread: సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.