ఉదయం లేవగానే రాగి చెంబులోని నీళ్లను కడుపునిండా తాగమని మన పెద్దవాళ్లు చెప్తున్నారు. చాలామంది లేవగానే లీటర్ నీటిని తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రెండోసారి నీళ్లు ఎక్కువగా తాగడం లేదు. ఉదయం పూట లేవగానే నీరు తాగేవారికి 25% జబ్బులు తక్కువగా వస్తాయి.
ఉదయం లేవగానే నోరు పుకిలించి రాగి పాత్రలో నీళ్ళని కడుపు నిండా తాగండి. చలి కాలం అయితే గోరు వెచ్చని నీరు తీసుకోండి. వేసవకాలములో చల్ల నీరు తీసుకోండి. ఒకేసారి లీటర్ నీటిని కాకుండా కొన్ని కొన్ని గా తాగండి. ఇవి రాగి చెంబు లో రాత్రి పోసి ఉదయం తాగడం వల్ల బాడీ కి కావలసిన కాపర్, అందుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ లు లభిస్తాయి. రాగి చెంబు వల్ల నీటిలో ఉన్న క్రిములు నశిస్తాయి. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బాడీ లోని వ్యర్థాలు యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదయం పూట రెండు సార్లు నీటిని తాగడం వల్ల బాడీ లోని రక్తం శుద్ధి అవుతుంది. మలశుద్ది జరుగుతుంది. అందుకే ఉదయం లేవగానే రెండు సార్లు నీటిని తాగడం మంచిది.