గుండెపోటు, బ్రైన్ స్ట్రోక్, బీపీ కూడా భవిష్యత్ లో ఏది రానివ్వదు.

గుండెపోటు, బ్రైన్ స్ట్రోక్, బీపీ కూడా భవిష్యత్ లో ఏది రానివ్వదు.

ఈ మధ్య కాలంలో ఎటు చూసినా ఈ వార్తే వినపడుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా గుండె పోటు తో చనిపోతున్నారు. మన శరీరంలో నిరంతరం రక్తప్రసరణ జరగడం వలన మన శరీర అవయవాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒక వేళ రక్తనాళాల గుండా రక్త ప్రసరణ ఆగి పోయింది అంటే మనిషి చనిపోయినట్లే. ఉంటుంది. మన శరీరంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రక్తప్రసరణ సరిగా జరగాలి అంటే ఏం చేయాలో చూద్దాం.

మన శరీరం లో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఏ భాగానికి జరగదో ఆ భాగానికి సమస్యలు తలెత్తడం, ఆ భాగాలు పాడైపోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఈ రక్తప్రసరణ జరగడానికి ఆటంకం కలిగించేవి రక్తనాళాలలో పూడికలు. రక్త నాళాల్లో కొవ్వు పేరుకొనే అవకాశాలు ఉంటాయి. రక్తనాళాల గోడలకి, కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోవడం వలన రక్తనాళాలు పూడిపోవడం జరుగుతాయి. ఎప్పుడైతే రక్తనాళాలు పూడికలు వచ్చి రక్త ప్రసరణ కు ఆటంకం దిగువ భాగానికి రక్తప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది.

అలా దిగువ బాగాలన్నింటికి రక్త ప్రసరణ సరిగా అందదు. అలాంటి సమయం వచ్చినప్పుడు ప్రాణం పోదు, కానీ గుండె లో రక్తనాళాల పూడికలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ మెదడులో రక్తనాళాల పూడికలు వస్తే మాత్రం ప్రాణమే పోతుంది. ఇలా రక్త నాళాలు పూడుకుపోవడం వలన హార్ట్స్ట్రోక్స్, బ్రైన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ రెండు రకాల స్ట్రోక్స్ కి కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం, ఇలాంటి స్థితి ని కనుక నివారించగలిగితే ఈ రెండు సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడవచ్చు.

రక్త నాళాల్లో పేరుకునే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలలో పేరుకోకుండా ఉండడానికి, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ కలిగి ఉన్న ఉన్నరోజువారి ఆహరం లో చేర్చుకోవడం వలన రక్త నాళాల్లో పూడికలు రాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ మరియు హార్ట్ స్ట్రోక్స్ రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసీడ్స్ లభించే ఆహరం చాలా చవకైన ఆహారం.

వాటిలో ఆవిశే గింజలు ఇవి చాలా ఉత్తమమైనవి. ఆవిశే గింజలు ఇతర విత్తనాల వలె సుమారు 550 క్యాలరీల శక్తి ని, సుమారుగా 18 గ్రాముల ప్రోటీన్ ని, 42 గ్రాములు కొవ్వు కలిగి ఉంటుంది. ఈ అవిశే గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి.. వీటిని రోజువారి ఆహారం చేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా మరియు రక్త నాళాల్లో ఫ్యాట్స్ రాకుండా నివారించడానికి మరిముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా నివారించడానికి ఎంతగానో ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ విషయాన్ని 2018లో అమెరికాలో రెండున్నర లక్షల మంది మీద “హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్” వీళ్లు పరిశోధన చేసి మరి చెప్పారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *