నిమ్మరసం ఉపయోగాలు తెలుసా మీకు?

అందానికి, ఆరోగ్యానికి నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది. వచ్చేది వేసవి కాలం ఈ కాలంలో చాలా మంది ఎండదెబ్బ కు గురి అవుతుంటారు, ఎండదెబ్బ తగిలిన వారికి నిమ్మరసం తీసుకోవడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది.

వేసవి లో ఎండ తీవ్రత వలన రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది, శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం కోసం నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. నిమ్మకాయలోని సహజ యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెంచడంలో దోహదపడుతాయి.

వేసవి ఎండ తీవ్రత వలన కొందరిలో జ్వరం మరియు జలుబు కూడా వస్తాయి వీటిని అదుపులో ఉంచడంలో నిమ్మకాయలు చాలా ఉపయోగపడతాయి. వేసవి లో బయట తిరగడం వలన చర్మకాంతి కోల్పోతుంటారు, చర్మ కాంతి పెంచడంలో నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది.

నిమ్మరసం తీసుకోవడం వలన దానిలోని యాంటీ యాక్సిడెంట్లు చర్మ కాంతి పెంచి వృద్దాప్య చేయాలను తగ్గిస్తుంది. నిమ్మకాయలో దొరికే విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ జుట్టు రాలకుండా పొడవుగా పెరగడానికి, మరియు బలహీన పడిన జుట్టు కుదుర్లను ధృడంగా చేయడానికి ఉపయోగపడుతుంది.

వేసవి లో బయట తిరిగే వారికి నిమ్మరసం ఇమ్యూనీటి బూస్టర్ గా పనిచేస్తుంది. అదేవిధంగా మలబద్దకంతో బాధ పడేవారికి నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండడం వలన కిడ్నీ లలో ఏర్పడే కాల్సియం రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. నిమ్మరసంలో ఇంకా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి, ఒంటి నుండి వచ్చే దుర్వాసన కూడా నీయంత్రిస్తుంది.