శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్.. ఈ రోజే వారి ఖాతాల్లోకి డబ్బులు

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పెద విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన మరో విడత డబ్బులను విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చిన సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసేది లేదు అని సీఎం జగన్ అన్నారు.ఈ రోజు సచివాలయం నుండి ఈ కార్యక్రమం బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌ – డిసెంబర్ 2021 త్రైమాసికానికి విద్యార్థులకు ఆర్ధిక సహాయం ఈ ప్రభుత్వం చేయబోతుంది అని తెలిపారు. మొత్తం రూ. 709 కోట్ల రూపాయలను ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ ఐతున్నట్లు చెప్పారు.

ఈ పథకం కింద ఈ సంవత్సరం 10.82 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది అని తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులలకు ఈ పథకం అందుతున్నట్లు తెలిసిన విషయమే.