షాక్ సిఎం కేసీఆర్‌కి కరోనా..!

కరోనా సెకండ్‌వేవ్‌తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. రోజుకి 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. సరైన చికిత్స అందక కరోనా రోగులు వైరస్‌కి బలైపోతున్నారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది.

24 గంటల్లోనే మహారాష్ట్రలో 68 వేలకు పైగా కేసులు నమోదయ్యయి. కరోనాతో 503 మంది చనిపోయారు.తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చీఫ్ సెక్రటరీ సోమవారం ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని, వైద్యుల సూచన మేరకు ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు జలుబు మాత్రమే ఉందని.. జ్వరం తగ్గిందని కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.

సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు.ఇక తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,55,433 మంది కరోనా బారినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల వ్యవధిలో 14 మంది వైర‌స్ బారినపడి చనిపోయారు. దీంతో మొత్తం ఇప్పటివరకు 1,838 మంది మ‌ర‌ణించ‌గా, 3,14,441 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *