కరోనా పేషెంట్స్ కి అద్భుత వరంగా మారిన ఈ పరికరం.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నా, మనకు ఈ వైరస్ గురించి పెద్దగా ఏమీ తెలీడం లేదు. ఇప్పుడు దీనికి సమాధానాలు వెతుకుతున్న ప్రపంచంలో మనం కూడా భాగ మైపోయాం. కరోనా వచ్చిన వారు ఆసుపత్రిపాలు కాకుండా ఉండాలి అంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని ఆక్సిజన్ మోతాదును పల్స్ అక్షీమీటర్ తో గుర్తించవచ్చు.. కానీ ఒకేసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లక తప్పని పరిస్థితి. Covid19: corona virus attacks second wave -fbhealthy.com

Alsoread: కరోనా కల్లోలం, అప్రమత్తమైన ఆధికారులు….

ఆక్సిజన్ సిలిండర్ కు అనుసంధానంగా ఉండే ఈ పరికరం కరోనా corona రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. కాగా ఈ పరికరాన్ని బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన ‘ది డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రో మెడికల్‌ లేబొరేటరీ’ తయారుచేసింది. దీనికి ‘ఎస్‌పీవో–2 సప్లిమెంటల్‌ ఆక్సిజన్‌ డెలివరీ సిస్టం’ పేరుపెట్టారు.

Alsoread: పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.