40 పైసలు ఎక్కువగా ఛార్జ్ చేశారని కోర్టుకెక్కిన కస్టమర్, అసలు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?

ఈ విచిత్రమైన ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూర్ లో జరిగినది. బెంగుళూర్ కి చెందిన వ్యక్తి పేరు మూర్తి. మూర్తి ఒక రోజు సెంట్రల్‌ స్ట్రీట్‌లోని ఒక హోటల్ కి వెళ్ళి అతనకి సరిపడా ఫుడ్ తెప్పించుకొని తిన్నాడు. ఈ తిన్నదానికి గాను హోటల్ యజమాని 265 రూపాయల బిల్లు వేసి ఇచ్చాడు.

కానీ కస్టమర్ ఆర్డర్ చేసిన దాని ప్రకారం అసలు ఫుడ్ ఆర్డర్ కి అయిన బిల్ మొత్తం రూ. 264.40 పైసలు దీనికి రౌండ్ ఫిగర్ చేసుకొని హోటల్ యజమాని 265 రూపాయల బిల్ వేశాడు. ఈ విషయాన్ని గమనించిన కస్టమర్ హోటల్ స్టాఫ్ పిలిచి ఆడగగా వాళ్ళు కస్టమర్ ని పట్టించుకోలేదు.

ఈ విషయంపై కోపం వచ్చిన కస్టమర్ బెంగుళూర్ లోని వినియోగదారుల ఫోరం లో కేసు పెట్టాడు. 40 పైసలు ఎక్కువ చార్జ్ చేసిన కారణంన తనకి ఒక్క రూపాయి నష్ట పరిహారాన్ని ఇప్పించగలరాని ఫోరం ని కోరాడు మూర్తి. ఈ కేసు ఎనిమిది నెలల పాటు కొనసాగింది, చివరికి కోర్టు లో రెస్టారెంట్ తరుపున వాధించిన న్యాయవాది గెలిచాడు.

అసలు ఏం జరిగినది అంటే కస్టమర్ కి ఎక్కువ వేసిన బిల్ 60 పైసలు సెంట్రల్‌ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ -2017 లోని సెక్షన్‌-170 ప్రకారం టాక్స్ కిందికి వస్తుంది అని కోర్టు కి తెలియజేసుకున్నారు.

అన్నీ వాదాలు పరిశీలించిన కోర్టు చివరకి బిల్లులో 50 పైసల కంటే ఎక్కువ ఉంటే దాన్ని రూపాయిగా పరిగణిస్తారు అని, తక్కువగా ఉంటే ఆ బిల్లు తీసివేసి రౌండ్ ఆఫ్ చేస్తారు అని కోర్టు స్పస్టం చేసింది. చివరకి కోర్టు సమయం వృధా చేసిన కస్టమర్ కి 4000 రూపాయాల జరిమానా వేసింది.