Diet in jaundice and liver diseases:ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది అందరిలో కామెర్లు. కాలేయ సంబంధి వ్యాధులు. వచ్చినవారికి కళ్ళు పచ్చగా ఉంటాయి .వాంటింగ్స్ అవుతుంటాయి. ఆకలి ఉండదు ,ఇది మొదట ఐదు రోజులు. వీరికి ఆహారము లిక్విడ్ రూపంలో ఇవ్వాలి. నూనె ఎక్కువగా వాడని ఆహార పదార్థాలు ఇవ్వాలి .వాంటింగ్స్ తగ్గేలా చూసుకోవాలి . కామెర్లు వచ్చిన వారికి ఆకలి బాగా వేస్తుంది .
అంటే కామెర్లు తగ్గుముఖం పడుతున్నట్టు ,అప్పుడు వీరికి అవి తినకూడదు ,ఇవి తినకూడదు అని చెప్పకుండా మెత్తటి ఆహారాన్ని కూరగాయలు పండ్లు ఎక్కువగా పెట్టాలి .లివర్ డిసీజ్ ఉన్నవారికి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వాలి .కామెర్లు రావడం వల్ల లివర్ కొంచెం డామేజ్ అవుతుంది. కాబట్టి లివర్ రికవరీ అవ్వడానికి ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వాలి.
ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాగా ఇవ్వాలి. చికెన్ ఎగ్స్ కూడా ఇవ్వాలి .ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల త్వరగా రికవరీ అవుతారు. లివర్ డిసీస్ ఉన్నవాళ్లు ఉప్పు తక్కువగా వాడాలి. ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల కాళ్ళ వాపులు వస్తాయి. ఉప్పు తక్కువగా వాడాలి .ఉప్పు అనగానే రాక్ సాల్డని అయోడైజ్డ్ సాల్ట్ అని ఎన్నో రకాల వస్తున్నాయి ఏదైనా సరే ఉప్పు ఎక్కువగా వాడకూడదు.