మీ మొబైలు, డెస్క్టాప్ లో ఈ పాస్వవర్డ్స్ వాడుతున్నారా?మిత్రమా జాగ్రత్త..!

ఎలక్ట్రిక్ పరికరాలకు, సోషల్ మీడియా అకౌంట్స్(వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్) కు పాస్ వర్డ్ పెట్టుకుంటాము. అన్నింటికన్నా ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, అలాగే ఫోన్ పే, జి పే లాంటి యాప్ లను ఉపయోగించాలంటే పాస్వర్డ్ కచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ చాలా పాస్ వర్డ్స్ ఉండడం వల్ల, అన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. చాలామంది సింపుల్ గా ఉండేలా పాస్ వర్డ్స్ పెట్టుకుంటూ ఉంటాము. కానీ, ఇవి ప్రమాదమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పాస్ వర్డ్స్ పెట్టుకోవడం వల్ల సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు, ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, వ్యక్తిగత డేటా చోరీ అయ్యే చాన్సుందని అంటున్నారు. అందుకే పాస్ వర్డ్స్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. Don’t use this type passwords are dangerous-fbhealthy.com

Alsoread: బయటకు వస్తే వాహనాలు సీజ్‌….నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

చాలామంది మర్చిపోకుండా ఉండడానికి సులువుగా పాస్ వర్డ్ పెట్టుకుంటూ ఉంటారు. మేము దానిని అర్థం చేసుకోగలం. యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ టెక్నికల్ డైరెక్టర్ కీలక విషయాలు చెప్పారు. అయితే సులువైన పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల వాటిని ఎవరైనా సులువుగా ఓపెన్ చేయొచ్చని అంటున్నారు.ఎప్పుడూ కూడా సెన్సిటివ్ డేటాకి ఎవరైనా గెస్ చేసే విధంగా పాస్ వర్డ్ పెట్టకూడదని అన్నారు. ఉదాహరణకు మొదటి పేరు, లోకల్ ఫుట్ బాల్ టీం లేదా ఫేవరెట్ బ్రాండ్. ఇలాంటివి మీరు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎవరూ గెస్ చేయలేని విధంగా పాస్వర్డ్ పెట్టుకోవడం సేఫ్. పాస్ వర్డ్ కాస్త డిఫరెంట్ గా ఉండడం మంచిదని అన్నారు. అదే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా కూడా ఉండాలి. Don’t use this type passwords are dangerous-fbhealthy.com

Alsoread: తండ్రి ఒక ప్రమాదంలో గాయపడ్డాడు,కొడుకు వచ్చాడు, అద్బుతం సృస్టి౦చాడు.

సైబర్ నిపుణులు కొన్ని పాస్ వర్డ్స్ తో లిస్టు తయారు చేశారు. ఇలాంటి పాస్ వర్డులను అస్సలు పెట్టుకోకూడదని చెప్పారు. ఒకవేళ ఈ లిస్టులో మీరు పెట్టుకున్న పాస్ వర్డ్ ఉన్నట్టు అయితే వెంటనే మార్చేయాలని సూచిస్తున్నారు. లేదంటే మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.గతేడాదిలో అత్యధిక మంది వినియోగించిన టాప్-10 పాస్ వర్డ్ లు:ఈ పది పాస్ వర్డ్స్ లో మీరు కనుక దేనినైనా ఉపయోగిస్తూ ఉంటే వెంటనే మార్చుకోండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

1.123456

2.123456789

3.qwerty

4.password

5.111111

6.abc123

7.password1

8.12345

9.1234567

  1. 12345678

Alsoread: షాక్……ఈ రోజు బంగారం ధర ఎంత తెలుసా?