ఆమె ఒక రక్షణ కవచం ఆమె ఒక మహా అద్భుతం.

నీ కాటుక కనులు విప్పారకపోతే, ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చెయ్యి కదలాడకపోతే.. యే మనుగడ కొనసాగదుగా,మగువా.. మగువా.. లోకానికి తెలుసా.. నీ విలువా..అని సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట.. సమాజంలో మహిళా శక్తిని గుర్తు చేస్తోంది. వారు లేని సమాజాన్ని ఊహించలేం. ప్రస్తుత కరోనా ఆపత్కాలంలోనూ.. వారి శ్రమ మాటల్లో చెప్పలేనిది. వారి కోసం తక్కువగా.. ఫ్యామిలీ కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తూ.. ఎప్పటిలాగే వారి ప్రేమకు, సహనానికి సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు. కరోనా యుద్ధంలో నగర మహిళలు కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. కొవిడ్‌ తమ ఇంటి దరి చేరకుండా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిదురించే వరకు.. నిరంతరం పనులు చేస్తూనే ఉంటున్నారు. ‘ఆమె’ ఉందన్న నమ్మకంతోనే కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది. కరోనాను తమ దరి చేరనివ్వదని విశ్వాసంతో కుటుంబం హాయిగా నిదురిస్తోంది. అదే నమ్మకం ఇంటి పెద్దను ఉపాధిపై దృష్టి సారించేలా చేస్తోంది. మొత్తంగా కరోనా విజృంభణ వేళ.. మహిళల పాత్ర అనిర్వచనీయమని పురుషులు ప్రశంసిస్తున్నారు. Every women solider of our house-entertainmentdessert.com

Alsoread: కొరోనాను 4 రోజుల్లోజయిస్తున్నారు..ఆ రహస్యం ఇదే| Manthena Satyanarayana Raju Videos|

ఇంట్లో గృహిణులే వైద్యులు:

ప్రస్తుత రోజులు వేరు. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. అడుగు బయట పెట్టాలంటే భయం. అది దరి చేరనివ్వకుండా కుటుంబాన్ని కాపాడటం ఓ సాహసమే. సాధారణంగా ఉదయం టిఫిన్‌ తయారీ.. మధ్యాహ్నం భోజనం.. రాత్రి డిన్నర్‌ ఏర్పాటు చేయడంలో గృహిణులు బిజీగా ఉంటారు. కాని, ప్రస్తుతం వారి పని రెట్టింపు అయింది. కరోనా వేళ అదనపు పనులు వారి వర్క్‌ లిస్టులో చేరాయి. సాధారణ వంటకాలు కాకుండా పోషక ఆహారాన్ని సమకూర్చే వంటకాల తయారీ, ఉదయం విభిన్న రకాల తేనీరు.. వేడీ నిమ్మ రసం, ఆవిరి పట్టడం.. తదితర పనులు జోడయ్యాయి. ఎవ్వరూ బయటకు వెళ్లి వచ్చినా ఇళ్లంతా మరోసారి పరిశుభ్రం చేయడం.. వారి బట్టలు ఉతకడం.. అదనపు పనిగా మారింది. పని మనుషుల సాయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో గృహిణుల శ్రమ గొప్పది. ఒక్క రోజు.. రెండు రోజులు కాదు.. తన ఊపిరి ఉన్నంత వరకు కుటుంబాన్ని అంటి పెట్టుకుంటూ సేవలు అందిస్తున్నారు మహిళలు. Every women solider of our house-entertainmentdessert.com

Alsoread: భారత మార్కెట్లోకి కొత్త మందు, మిగతా వాటికి దీనికి తేడా ఏంటి?

కుటుంబానికి రక్షణ.. మహిళ:

కరోనా కష్ట సమయంలో మహిళలపై ఒత్తిడి పెరిగినా చాలా సానుకూల శక్తులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులలో రోగ నిరోధక శక్తిని పెంచే చిట్కాలను పాటిస్తున్నారు. ఇంట్లో మహిళలకు పురుషులు సహాయంగా నిలవాల్సిన సమయం ఇది. కరోనా వేళ పనులు రెట్టింపు అయ్యాయనేది వాస్తవం. మేం చేసే శ్రమకు గుర్తింపు రావాలని కోరుకోం. ప్రతి ఇంటికి ఓ మహిళ అండగా నిలబడుతుంది. కాబట్టే, వాళ్లంతా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు.

ఒత్తిడిని తట్టుకొని నిలబడుతున్నాం:

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. తన కుటుంబానికి ఏమీ కాకూడదనే స్వార్థం ప్రతి మహిళకు ఉంటుంది. అందుకే వారి కోసం నిరంతరం శ్రమిస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాలతో కూడిన వంటలు తయారు చేస్తుంది. ప్రస్తుత కరోనా సమయంలో రెస్ట్‌ తీసుకునే సమయం కూడా ఉండటం లేదు. ఏదో ఒక పని ఉంటూనే ఉంది. బయటకు వెళ్లినా.. ఇంటికొచ్చినా.. శానిటైజింగ్‌ నుంచి బట్టలు ఉతకడం వరకు పనులు రిపీట్‌ అవుతూనే ఉంటాయి. పిల్లలు, వృద్ధులున్న ఇంట్లో వారి కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Alsoread: అతిగా శానిటైజర్‌ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.