శోభనం రాత్రి పై ఉండే ఈ అపోహలు నమ్మకండి.

ముందుగా ప్రతి అబ్బాయి కచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మాయిలకు కన్నెపొర ఉంటేనే వాళ్లు[శీలవతులు] వర్జిన్ అని లేకపోతే కాదన్న అపోహ చాలా మందికి ఉంది. ప్రతి మగాడు శోభనం రోజు రాత్రి భార్య యోనిలో నుంచి రక్తం రాకపోతే ఆమె కన్య కాదని విడాకుల వరకు వెళ్లిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. దీనికి కారణంగా కన్నెపొరపై సరైన అవగాహన లేకపోవడమే. కన్నెపొర అనే యోని చుట్టూ పలుచగా పరుచుకుని ఉంటుంది. ఉల్లిపొర, పూతరేకు కంటే చాలా పలుచగా ఇది ఉంటుంది.

Alsoread: వ్యాక్సిన్ కి వాక్సిన్ కి మధ్య ఎంత టైమ్ ఉండాలి?కచ్చితంగా చూడండి.

తొలి కలయిక సమయంలో యోని పై భాగంలో ఉండే హైమన్ పొర చిట్లుతుంది. ఫలితంగా రక్తస్రావం అవుతుంది అని చాలా మంది భావిస్తారు. కానీ హైమన్ పొర మందంగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. అంతే కాకుండా సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, బైక్ రైడింగ్ లాంటి పనులు చేసే అమ్మాయిల్లో ఈ పొర ముందే చిరిగిపోయే అవకాశాలే ఎక్కువ. కానీ ఆ విషయం వారికి తెలియదు. కాబట్టి తొలి కలయికలో రక్తస్రావం కావడం, కాకపోవడం అనేది అంతగా పట్టించుకోవాల్సి విషయమేం కాదు.

Alsoread: ముకేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా?

మరి కొంత మంది అమ్మాయిలకు ఇది సగమే ఉంటే మరికొందరైతే కన్నెపొర లేకుండా పుడతారు. కొందరు అమ్మాయిలకైతే ఆటలాడినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, ఎత్తు ప్రదేశాల నుంచి దూకినప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు, గుర్రపు స్వారీ చేసిన సందర్భాల్లో వారికి తెలియకుండానే కన్నెపొర చిరిగిపోతుంది. కొందరు అమ్మాయిలకైతే కన్నెపొర మందంగా ఉండి తొలి కలయిలో అంగం లోనికి ప్రవేశించినప్పుడే అది చిట్లి రక్తం వస్తుంది. మరికొందరికైతే కన్నెపొర చిరిగినా కూడా రక్తం కారదు. అబ్బాయిలు ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

Alsoread: ప్రముఖ హీరోయిన్ తో జబర్దస్త్ కామిడీ కింగ్.