కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎముకల బలహీనత సమస్యలతో బాధపడేవారికీ  ఈ రెమెడీ ఒక అద్భుత ఔషధం.

కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎముకల బలహీనత సమస్యలతో బాధపడేవారికీ ఈ రెమెడీ ఒక అద్భుత ఔషధం.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమస్యలు వందలో 30 మందిని రోజు వేదిస్తున్న సమస్యలే. ముఖ్యంగా కీళ్ల, మోకాళ్ళ నొప్పలు మాత్రం ఏకంగా వందలో 50 మందిని వేదిస్తున్న పెద్ద సమస్య. ప్రస్తుత కాలంలో కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, అదేవిధంగా అలసట, నీరసం, రక్తహీనత ఇక ఎన్నో సమస్యలు నిత్యం మనిషిని వేదిస్తున్నవే. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక చక్కటి రెమిడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక చాలా మంది అయితే ఈ నొప్పుల సమస్య నుండి త్వరగా బయట పడే క్రమంలో నిత్యం ఏదో ఒక మెడిసిన్ ని వాడుతూనే ఉంటారు. ఈ మెడిసిన్ అప్పటికప్పుడు ఉపశమనం ఇచ్చినప్పటికి ఈ మెడిసిన్ ద్వారా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావడం చాలా మందిలో గమనిస్తూనే ఉంటాం. అయితే ఏలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రాకుండా వంటింట్లో దొరికే వస్తువులతో ఈ చక్కటి రెమెడీ చేసి చూడండి.

ఈ రెమెడీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం:

తయారీ విధానం చూద్దాం:


ముందుగా స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో మనకు సరిపడా ఒక గ్లాస్ పాలు వేసుకోండి. ఆ పాలల్లో ఒక స్పూన్ సొంపు వేసుకోండి. వీటితో పాటు గా ఈ రెమెడీ కి అల్లం కూడా తీసుకోవాలి, అల్లం ని ఒక చిన్న ముక్క తీసుకోవాలి దానిని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోని వేసుకోవాలి. ఒక వేళ మీకు అల్లం అందుబాటులో లేకపోతే శొంఠి పొడిని తీసుకోవచ్చు. అద్భుత ఔషధ గుణాలు గలిగిన శొంఠి ఈ రెమెడీకి మాత్రం ఒక పావు స్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఈ పాలను ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి.

ఇక మనకు కావాల్సిన రెమెడీ రెఢీ ఐనట్లే. ఈ డ్రింక్ రుచి కోసం ఒక స్పూన్ తేనె లేదా పటిక బెల్లం పొడిని కలుపుకోవచ్చు. ముఖ్యంగా చక్కెర ను మాత్రం వాడవద్దు. అయితే ఏ డ్రింక్ ని పడుకునే అరగంట ముందు తాగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ రెమెడీ ని షుగర్ వ్యాధి ఉన్న వారు నిపుణుల సలహా మేరకు వాడుకోండి. ఈ డ్రింక్ తాగడం వలన ఆర్థరైటీస్ నొప్పులను తగ్గిస్తుంది. వాత నొప్పులను పోగొడుతుంది. మీ చర్మం చక్కగా మెరిసిపోతుంది. ఈ రెమెడీ మీకు అద్భుతంగా ఔషధం లా పనిచేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!