ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు తెలిస్తే జీవితంలో అస్సలు వదిలిపెట్టరు.

ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు తెలిస్తే జీవితంలో అస్సలు వదిలిపెట్టరు.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత వినే ఉంటారు. ఉల్లి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకారిని అని ఎంత మందికి తెలుసు? కొంత మంది ఉల్లి వాసన చూసిన, కూరలో ఉల్లి వేసిన వద్దు అంటుంటారు. ఇంకొంత మంది ఇండ్ల లలో ఉల్లి లేని కూర దాదాపుగా ఉండదేమో అనిపిస్తది. ఉల్లి ని కూరల్లో వాడితే రుచిగా ఉండడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. కూరల్లో ఉల్లి వేయడం ఒక ఎత్తు అయితే పచ్చి ఉల్లిపాయ తింటే ప్రమాదకరమైన రోగాల ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. మాంసాహార ప్రియులు ఉల్లిని ఇష్టంగా కూరల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇక ఈ ఉల్లిపాయలను చాలా హోటళ్లలో సలాడ్ల తయారీకి కూడా ఉపయోగిస్తారు.

ఉల్లి ఘాటైన వాసన కారణంగా, చాలామంది దీనిని తీసుకోవడానికి ఇష్టపడరు. ఉల్లిపాయలలో ఫైబర్, ప్రోటీన్, క్యాలరీలు క్యాల్షియం, ఇనుము, పోలేట్, మెగ్నెట్, పొటాషియం, సమృద్ధిగా లభిస్తాయి. ఇక పచ్చి ఉల్లిపాయల విషయానికి వస్తే దానిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, అసెప్టిక్ ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. NCBI నివేదిక ప్రకారం ఉల్లిపాయలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఈ కారణంగా ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే మీకు షుగర్ సమస్య ఉంటే పచ్చి ఉల్లిపాయలను రోజు కొంత మొత్తంలో తింటే మీ షుగర్ సమస్య ను అదుపులో ఉంచుకోవచ్చు.

అయితే ఒక పరిశోధన ప్రకారం ఉల్లిపాయలు కెర్సిటిన్ అందసైనిస్ లో సమృద్ధిగా ఉంటాయి.ఉల్లి ఆంటీ ఆక్సిడెంట్లు గా పనిచేస్తాయి. మీ శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి రొమ్ము కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాద స్థాయి లను తగ్గిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉల్లిపాయలు తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి పచ్చి ఉల్లి ఔషధంగా పనిచేస్తుంది.పచ్చి ఉల్లిపాయ ఆహరంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోతాయి, ఉల్లి కడుపు ని శుభ్రపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి పచ్చి ఉల్లిపాయ ను సలాడ్ లేదా మీకు నచ్చిన ఆహారంలో వీటిని తప్పకుండా తినండి.

ఉల్లిపాయలలో లైంగిక శక్తిని పెంచే లక్షణం ఉండటం వలన పురుషులలో టెస్టోస్ హార్మోన్ స్థాయిని పెంచుతాయి. సంతాన సమస్య లతో బాధపడే వారికి ఉల్లి మంచిగా పనిచేస్తుంది. ఉల్లి మీ లైం*గిక జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఉల్లి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లూ మెంటరి లక్షణాలు కలిగి ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపదుతుంది. ఉల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉల్లి ఎముకలను ధృడంగా తయారు చేయడం లో మంచిగా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెప్తున్నారు. అయితే బోలు ఎముకల సమస్య తో బాధపడేవారు ఉల్లి తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *