Gpay చెల్లింపులు సురక్షితమేనా? ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది.

Gpay చెల్లింపులు సురక్షితమేనా? ఇప్పుడు ఎందుకు ఆ డౌట్ వచ్చింది.

గూగూల్ పే Gpay గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆర్థిక వ్యవహారాల నిపుణుడు అభిజిత్ మిశ్రా ఆర్‌బీఐ అధికారిక అనుమతి లేకుండానే ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గూగుల్ పే యాప్ పేమెంట్ సిస్టమ్‌లా వ్యవహరిస్తోందని,గూగుల్ పే పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ యాక్ట్‌కు విరుద్ధమని ఆయన తెలిపారు.పేమెంట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు గూగుల్ పే ఆర్‌బీఐ నుంచి ఎటువంటి అనుమతులు లేవని తన అపిల్‌లో ఆరోపించారు. ఎన్‌పీసీఐ మార్చి 20, 2019లో విడుదల చేసిన అధికారిక పేమెంట్స్ సిస్టమ్స్ ఆపరేటర్ల జాబితాలో గూగూల్ పే పేరు లేకపోవడాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Alsoread: సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

ఢిల్లీ హైకోర్టుకు కేసు విచారణలో భాగంగా ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానం గూగుల్ పే యూజర్లను, సాధారణ ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టింది. ఢిల్లీ హైకోర్టుకు ఆర్‌బీఐ ఏం సమాధానం చెప్పిందంటే గూగూల్ పే ఎటువంటి పేమెంట్ సిస్టమ్స్‌ను నిర్వహించడం లేదని, గూగూల్ పే ఒక థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమే అని ఆర్‌బీఐ చెప్పింది. దీంతో ఈ స్టేట్‌మెంట్ కొంత గందరగోళానికి దారితీసింది. ఈ స్టేట్‌మెంట్ గూగూల్ పే చట్టబద్ధమైనది కాదని, జీపే ద్వారా కార్యకలాపాల నిర్వహించడం ప్రమాదం అని కొందరు నమ్ముతున్నారు. ఈ గందరగోళం లో గూగూల్ పే ఒక ప్రకటన విడుదల చేసింది.

Alsoread: ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

ఈ గందరగోళం లో గూగూల్ పే ఏం చెప్పింది అంటే గూగూల్ పే పూర్తిగా చట్టబద్ధమైన యాప్ అని, యుపిఐ ద్వారా నగదు చెల్లింపులు జరిపేందుకు గూగూల్ పే తన బ్యాంకు పార్ట్నర్లకు కేవలం సాంకేతిక సేవలను మాత్రమే అందిస్తుంది. యుపిఐ యాప్‌లను థర్డ్ పార్టీ యాప్‌లుగా విభజించారు అని చెప్పారు.యుపిఐ యాప్‌లకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కావాల్సిన అవసరం లేదు అని జీపే ద్వారా చేసే చెల్లింపులన్నీ ఆర్‌బీఐ, ఎన్‌సీపీఐ నియమాలను అనుసరించి జరుగుతాయి అని చెప్పింది. దానివల్ల ప్రతి పేమెంట్ పూర్తి సురక్షితం అని తెలిపింది. పేమెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా 24గంటలూ అందుబాటులో ఉంటుంది అని చెప్పారు. జీ పే కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా తమ కస్టమర్ లు వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని తెలిపింది.

Alsoread:ఈ చిన్న పని చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది తెలుసా?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *