జామపండు తింటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి.

జామపండు తింటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి.

జామకాయ తెలియనివారు ఉండరు.ఇదొక అద్భుతమైన ఫలం అని చెప్పవచ్చు. అయితే జామపండులో అన్ని పండ్ల కంటే విటమిన్-సి అధికంగా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ ఫలాన్ని మాత్రం ఈ మూడు వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు. జామకాయలు ఈ మూడు వ్యాధులు ఉన్న వారు ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జామకాయ ను గ్యాస్, కడుపు ఉబ్బరం, పేగు సిండ్రోమ్ తో భాదపడుతున్నవారు అస్సలు తినకూడదు.

అయితే జామలో ప్రోటీన్ పీచుపదార్థం విటమిన్ సి, ఫాస్పరస్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, దండిగా ఉంన్నాయి. ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ జామపండు కొన్ని వ్యాధులు ఉన్న వారికి హాని అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్యాస్ సమస్య, ఎవరైతే గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు, అలాంటివారు జామను తినకపోవడమే మంచిది. కడుపు ఉబ్బరం ఉన్న వారికి జామ తింటే ఉబ్బరం సమస్య పెరుగుతుంది. ఇలాంటి వారు జామ పండును తినకపోవడమే చాలా మంచిది. జామపండులో లో 40 శాతం ఫ్రక్త్రోజ్ఉంటుంది.

ఇది శరీరంలో సులభంగా గ్రహించబడుతుంది. దీని కారణంగా ఈ సమస్య ఇంకా పెరగవచ్చు, అదేవిధంగా నిద్రపోయేముందు, జామకాయను తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. అలాగే పేగు సిండ్రోమ్ తో బాధపడుతున్న వారు జామ పండు ను తినకపోవడమే మంచిది.. ఇక షుగర్ వ్యాధి తో భాదపడే వారు జామపండు తినడం మంచిదే అయినప్పటికీ జామ పండును అధికంగా తీసుకోకూడదు. ముఖ్యంగా షుగర్ తో భాదపడేవారు రక్తంలో చక్కర స్థాయి ని చూసి తీసుకోవాలి. ఆకుకూరల్లో లభించే పీచు కంటే కంటే రెండింతలు అధికంగా పీచు పదార్థం జామపండు లో లభిస్తుంది. అయితే మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొలాజెన్ ఉత్పత్తికి ఇది కీలకం.

కొవ్వు మెటబాలిజం ని ప్రభావితం చేసే పెక్టిన్ జామ పండు లో లభిస్తుంది. మలబద్దకం తో బాధపడే వారికి జామ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే జామకాయ కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామపండులో కొవ్వు కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే జామ లో ఉండే విటమిన్ సి, అనేది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జామపండ్లు సంవత్సరం పొడవునా లభించినప్పటికి వీటి రుచి శీతాకాలంలో భలే ఉంటుంది. జామపండు లో కమలా పండు లో కంటే విటమిన్ సి లభిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *