నా కూతురుని ప్రేమిస్తావా అంటూ యువతి తల్లి తండ్రి బీభత్సం.

కర్ణాటక లోని హోసూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి తల్లి తండ్రులు భీభత్సం సృష్టించారు. తన కుమారత్నే ను ప్రేమించాడు అనే కొపం తో ఆ యువకుడి ఇంటిని ఘోరంగా ధ్వంసం చేశారు. ఈ ఘోరాన్ని భరించలేని యువకుడు అవమానాన్ని తటుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి మనోవేదన కు గురై పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలు అయింది.హోసూరు జయశక్తినగర్‌కు చెందిన యువకుడు హోసూరులోని ప్రైవేట్‌ కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు.

Alsoread: సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

ఇక విషయాల్లో కి వెళ్తే వీరిద్దరూ కర్ణాటక లోని హోసూరులో చదివేటప్పటినుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ 18 ఏళ్ల యువతి మత్తిగిరి కూడలిరోడ్డుకు చెందినకర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరులోని కళాశాలలో బీకాం చదువుతోంది. వీరిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తల్లి తండ్రులు ఈ నెల 11 నా యువకుడి ఇంటికి వచ్చి నానా రభస చేశారు. ఈ అవమానాన్ని భరించలేని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేస్కున్నడు, ఈ ఘటన తెలుసుకున్న యువతి తన వల్లే ఇలా జరిగింది అని మనోవేదనతో పురుగుల మందు తాగింది. ఆ యువతిని దగ్గర లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు లో ఉంది.

Alsoread:కన్న కొడుకు వీర్యం తో బిడ్డను కనాలి అనుకుంది. మరువలేని సంఘటన జరిగింది.