మీ బరువు తగ్గించుకొనే అద్భుతమైన జ్యూస్

రోజు వారి దిన చర్య లో మార్పులు మనుషుల ఆహారంలో మార్పులు చాలనే మారాయి. వారు తినే ఆహారాపు అలవాటే చిన్న పెద్ద తేడా లేకుండా ఊబకాయం కు దారితీసున్నాయి. చిన్న వయసులోనే బరువు పెరిగీ ఎలా తగ్గాలో తేలిక జిమ్ ల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారికోసమే ఈ చక్కటి రెమెడీ.

ఇంట్లో దొరికే ఈ చిన్న రెమెడీ చేసుకున్నట్లైతే మీరు బరువు తగ్గుతారు. మిమ్మల్ని త్వరగా బరువు తగ్గించే రెమెడీ ఎంతో తెలుసుకుందాం. ఆ రెమెడీ సొరకాయ, అవును సొరకాయ మీ బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటామిన్ బి, సి, ఎ, కె, ఇ, ఫోలెట్, ఐరన్, మెగ్నీషియం ఇంకా అలాగే పొటాషియం కూడా ఉన్నాయి.

సొరకాయ బరువు తగ్గించడమే కాకుండా దీనిలోని విటమిన్ బి మరియు పీచు పదార్థం శరీరం యొక్క జీవక్రియ రేట్ పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్న వారికి కూడా ఈ సొరకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

  1. సొరకాయ
  2. నిమ్మరసం
  3. ఉప్పు

ఒక తాజా స్వరకాయను తీసుకొని దాని పై తొక్క తీసివేసి చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను జ్యూసర్ లో జ్యూస్ చేసి వాడకట్టుకోవాలి. ఆ జ్యూస్ కావాలి అంటే రుచికి కొంచెం నిమ్మ రసం, ఉప్పు కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న జ్యూస్ ని రోజు తాగడం వలన బరువు తగ్గించుకోవచ్చు.