హార్ట్ స్ట్రో**క్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఎంటో ఖచ్చితంగా తెలుసుకోండి.

హార్ట్ స్ట్రో**క్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఎంటో ఖచ్చితంగా తెలుసుకోండి.

ఈ మధ్యకాలంలో ఎటు చూసిన గుండెపోటు మరణాలే కనపడుతున్నాయి. అయితే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ హార్ట్ ఎటాక్ లకి ప్రధాన కారణం ఎంటో డాక్టర్ లు కూడా చెప్పలేకపోతున్నారు. చాలా మందికి గుండెపోటు వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలు తెలియదు.శరీరంలో గుండెపోటుకు గురయ్యే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఆ క్షణం వరకు ఎంతో బాగా ఆరోగ్యంగా కనిపించి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈ గుండెపోటు కారణంగా వారి ప్రాణాలు విడుస్తున్నారు. అయితే పూర్వ కాలంలో గుండెపోటు అంటే 50-60 ఏళ్లు పైబడిన వయసు వారిలో కనిపించేది. ఆ ఏజ్ వారిలో అధిక బరువు ఉండి, బీపీ, షూగర్‌ వంటి సమస్యలతో బాధపడేవారికీ మాత్రమే హార్ట్‌ ఎటాక్‌ సమస్య కనపడేది.

ఈ సడన్ హార్ట్ ఎటాక్ లో చాలా అరుదుగా కనిపించేవి. ఇలాంటి వారికి ముందుగా చాలా మైల్డ్‌ హార్ట్ ఎటాక్‌ వచ్చేది. ఇక వారు ఆ సమస్య కు తగ్గట్టుగా చికిత్స తీసుకుంటే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గేవి. ఇప్పుడున్న కాలంలో వచ్చే హార్ట్ ఎటాక్ మరణాల్లో ఇలాంటి అవకాశాలు ఏమి లేవు డైరెక్ట్ గుండెపోటుకు గురవ్వడమే ఆలస్యం మనిషి వెంటేనే మరణిస్తున్నాడు. తాజాగా హార్ట్ ఎటాక్ లకి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ సమస్య కరోనా బారిన పడినవారు, కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు, మరియు పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిలో ఎక్కువగా ఈ మరణాలు కనిపిస్తున్నాయి అనే సందేహాలు వినపడుతున్నాయి.

కానీ డాక్టర్ లు మాత్రం ఈ గుండెపోటు మరణాలకు, కరోనా, టీకాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చేస్తున్నారు. అయితే గుండెపోటు వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే అరగంట ముందు కొన్ని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ లక్షణాలను సరిగా అంచనా వేయగలిగితే హార్ట్ ఎటాక్ బారిన పడిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.అయితే గుండెపోటు వచ్చే అరగంట లక్షణాలు చూద్దాం. హార్ట్ ఎటాక్ కు గురయ్యే వారిలో ఎడమ చేతిలో నొప్పి వస్తుంది. వారికి వెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. అయితే ఈ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే గుండె పోటుతో మృతి చెందే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

ఇక పురుషులతో పోలిస్తే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం కాస్త తక్కువ అంటున్నారు వైద్య నిపుణులు. మహిళల్లో జరిగే రుతుస్రావం వలన ఈ సమస్య వారిలో తక్కువగా కనిపిస్తుంది అని అంటున్నారు వైద్యులు. 45 ఏళ్లకు పైబడిన మహిళలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా గుండె పోటు వస్తున్నాయి. అయితే దాదాపు ఒక మహిళకు హార్ట్ ఎటాక్ వస్తే పది మంది పురుషులకు హార్ట్ ఎటాక్ వస్తుంది అని తెలిపారు. ముఖ్యంగా యువత హార్ట్ ఎటాక్ కి గురి అవడానికి ప్రధాన కారణం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, మైదాతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన అంటున్నారు నిపుణులు. ఆహారపు అలవాట్లకి తోడు యువత వయసుకు తగ్గటుగా వ్యాయామం, యోగా చేస్తే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *