పుదీనా టీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

పుదీనా లో యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉన్న ఆహరం కాబట్టి రోగనిరోధక శక్తి పెంపోదించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా ఒక హెర్బల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. మరియు పుదీనా నోటి దుర్వాసన పోగొట్టడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది.

పుదీనా టీ కి కావాల్సిన పదార్థాలు:

  1. పుదీనా ఆకులు
  2. వేడినీరు
  3. తేనె

ALSO READ: సినిమా లో మాదిరి ఒకే సారి 50 వాహనాలు ఢీ….ముగ్గురు మృతి చెందారు.

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని పుదీనా ఆకులు వేయాలి. ఆ ఆకులు మునిగేంత వరకు ముందుగా కాచుకున్న వేడి నీరును దానిలో పోసుకోవాలి. దానికి ఒక ఐదు నిమిషాల తరువాత వాడకట్టుకొని టీ కి సరిపడా తేనె కలుపుకొని ఎప్పుడైనా తాగవచ్చు.

ఈ టీ శరీరానికి కావాల్సిన విటమిన్లు A, B, C మరియు D లు లభిస్తాయి. భోజనం అనంతరం ఈ టీ తీసుకోవడం వలన జీర్ణక్రియ సరిగా జరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ALSO READ: వేసవిలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా మీకు?