ఇంట్లోనే అతి తక్కువ ఖర్చు తో మీ పళ్ళను అద్దంలా మెరిసేలా చేస్కోండి.

ఇంట్లోనే అతి తక్కువ ఖర్చు తో మీ పళ్ళను అద్దంలా మెరిసేలా చేస్కోండి.

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పని పళ్ళను శుభ్రం చేస్కోవడం.ప్రతిరోజు పళ్ళను శుభ్రం చేసుకోవడం వలన పళ్ళు పసుపు పచ్చగా మారకుండా శుభ్రంగా ఉంటాయి. అయితే మనం పళ్ళను ఎంత శుభ్రం చేసినా పళ్ళల్లో బ్యాక్టీరియా పూర్తిగా తొలగి పోకుండా కొంత శాతం అలాగే మిగిలి ఉంటుంది.. మనం ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఆ పదార్థాలను పూర్తిగా నమిలినపుడు పళ్ల మధ్య ఇరుక్కుపోయిన పదార్థాల్లోని ప్రోటీన్ ,గ్లూకోజ్ మరియు బయో ప్రొడక్ట్స్ తీసుకొని పళ్ళ సందుల్లో తెల్లగా పేరుకుపోతుంది.

ఈ plaque చూడటానికి తెల్లగా ఉండే పదార్థం ఇది మన పళ్ల మధ్యలో ఏర్పడటం సరిగా చూడలేము. ఈ పొర కొంచెం కొంచెంగా మందంగా మారినపుడు మన నాలుకతో పంటిపై తగిలితే కానీ ఈ పొర ఏర్పడినట్లు తెలీదు. ఈ తెల్లటి పదార్థం మనము బ్రష్ చేసిన కానీ పూర్తిగా ఎప్పుడు క్లీన్ అవ్వదు. ఈ plaque ని క్లీన్ చేస్కోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. రోజు రోజు కి ఆ తెల్లటి పదార్థం పళ్ళపై పచ్చగా మారుతుంది. దాన్ని క్లీన్ చేస్కోవడానికి అందరూ దంత వైద్యుల వద్దకు వెళ్ళి ఖర్చు చేస్తుంటారు. పచ్చగా మారిన మీ పళ్ళను ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా క్లీన్ చేస్కోవాలో ఇప్పుడు చూద్దాం.

మొదటి రెమెడీ చూద్దాం:

  • టమోటా
  • కమలా పండు పై తొక్క
  • ఉప్పు

రెమిడీ ఎలా తయారు చేయాలో చూద్దాం, ఒక టమోటా, కమలా కాయ తొక్కు మరియు ఉప్పు తీసుకోవాలి. కమలా పండు యొక్క తొక్కు టమాటాలు మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసకొన్న మిశ్రమాన్ని మీ బ్రష్ మీద వేసి కొద్దిగా ఉప్పుని దాని మీద వేసి పళ్ళు తోముకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసకొన్న తరువాత రోజు బ్రష్ చేసుకొనే పేస్ట్ తో ఒక సారి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది.

రెండవ రెమెడీ చూద్దాం:

  • కొబ్బరి నూనె
  • బేకింగ్ సోడా
  • ఉప్పు

తయారీ విధానం: కొబ్బరి నూనె, బేకింగ్ సోడా మరియు కొద్దిగా ఉప్పు తీసుకోవాలి.. ఒక చిన్న కప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి అందులో అరస్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ చేతి వేళ్ళతో కానీ టూత్ బ్రష్ తో కానీ మీ పళ్ళను బ్రష్ చేసుకోండి. బేకింగ్ సోడా మన పళ్లపై ఉండే పసుపు ధనాన్ని మరియు బాక్టీరియాని తొలగిస్తుంది. మీ పళ్ళని పచ్చదనం నుండి కాపాడుకోండి.

మూడవ రెమెడీ చూద్దాం :

ఈ రెమిడిని ఎలా వాడలో ఇప్పుడు చూద్దాం, ముందుగా నల్ల నువ్వులు, లవంగ నూనె(cloveoil) ని తీసుకోవాలి. రెండు నుంచి మూడు చెంచాల నల్ల నువ్వులను మీ నోట్లో వేసుకొని ఒకసారి బాగా నమిలి మీ నోట్లోనే ఉంచుకోవాలి. తర్వాత మీ టూత్ బ్రష్ ఒకసారి నీళ్లలో కడిగి దానిపై నాలుగు నుంచి ఐదు చుక్కల లవంగం నూనె(cloveoil) వేసి మీ పళ్ళను బాగా శుభ్రం చేసుకోండి. మనం ఆహారం తిన్న తర్వాత ఆహారంలో ఉండే కొన్ని పదార్థాలు మన నోట్లో ఉండే పళ్ళలో ఉండిపోతాయి దీనివల్ల plaque తయారవుతుంది.

ఈ plaque నుంచి మన కాపాడుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఒక చెంచా సోంపు తినండి. సోంపు తినటం వల్ల మన పళ్ళు శుభ్రంగా అవుతాయి మరియు భోజనం కూడా బాగా జీర్ణం అవుతుంది. అలాగే రోజు మొత్తంలో ఎక్కువ శాతం నీళ్లు తాగండి. నీళ్లు తాగడం వల్ల మన పళ్ళు నోరు శుభ్రం అవుతుంది.ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించండి. మీ పళ్ళ పై ఏర్పడే ఎలాంటి మొండి గరలైన సరే చాలా సులభంగా తగ్గిపోతాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *