బరువు తగ్గడంతో పాటు మీ జుట్టు  సమస్యను  కూడా ఇట్టే పోగొట్టుకోండి.

బరువు తగ్గడంతో పాటు మీ జుట్టు సమస్యను కూడా ఇట్టే పోగొట్టుకోండి.

మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహార నియమాల వలన మన శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను పోగొట్టుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. అయితే చాలా మంది సంపాదించిన దానిలో సగం వరకు హాస్పిటల్ లకి ఖర్చు పెట్టేస్తున్నారు. కొన్ని రకాల సమస్యలను ఎటువంటి డాక్టర్ దగ్గరకి క వెళ్ళినవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన శరీరంలో చాలా రకాల సమస్యలు తగ్గుతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.

కావాల్సిన పదార్థాలు:

  1. వెల్లుల్లి
  2. తేనె
  3. గాజు సీసా

తయారీ విధానం:

ముందుగా 20 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మునిగేంత వరకు తేనెను వేసుకోవాలి. తేనె మరియు వెల్లుల్లి రెబ్బలను ఒకసారి కలుపుకొని గాజు సీసాలో వేసుకొని ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. వారం రోజుల సమయం తర్వాత వెల్లుల్లి రెబ్బలు మెత్తబడతాయి. ఈ మిశ్రమ ఎక్కువగా కావాలి అనుకునే వారు 200 వెల్లుల్లి రెబ్బలను తెచ్చుకొని వాటిని తగిన మోతాదు లో తెనే తీసుకొని నానబెట్టుకోవచ్చు. ఆ తరువాత వాటిని రోజుకి రెండు చొప్పున ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన శరీరంలో వచ్చే రకరకాల నొప్పులను ఉపశమనం పొందవచ్చు. ఈ రెమెడీ తో జీర్ణ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి ఇవేకాకుండా గ్యాస్, ఎసిడిటీ పంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. చర్మ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిస్తాయి.

ఈ రెమెడీ వలన కలిగే లాభాలు ఎంటో చూద్దాం:

వెల్లుల్లి అనేది శరీరంలో ఇన్ఫ్లషన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి తినడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మరియు వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కరిగిస్తుంది. అయితే శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి, ఈ జాగ్రత్తలు పాటించినట్లైతే శరీరంలో అనేక రకాల సమస్యలు సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ రెమెడీ ప్రతి రోజు వాడటం వలన శరీరంలో ఉండే వాపులు, నొప్పులు, ఇన్ఫ్లషన్ సమస్యలను తగ్గిస్తుంది. శరీరం లో ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే ఈ సమస్యలను తగ్గించడంలో కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ రెమెడీ జుట్టు కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:

ఈ రెమెడీ తినడం వలన స్కాల్ఫ్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు వెల్లుల్లి తీసుకోవడం వలన ముఖంలో ముడతలు రాకుండా ఉంటాయి. వెల్లుల్లి ఉపయోగించడం వల్ల ఇంకా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రెమెడీ ని అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. దీనివల్ల శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ రెమెడీ ప్రతి చిన్న విషయానికి వైద్యుల చుట్టూ తిరగకుండా చేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!