కేవలం 5 రూపాయల ఖర్చు తో మీ ముఖం అద్భుతంగా మెరిసిపోతుంది.

కేవలం 5 రూపాయల ఖర్చు తో మీ ముఖం అద్భుతంగా మెరిసిపోతుంది.

పార్టీ లేదా ఫంక్షన్ వెళ్తున్నారా మీకోసమే ఈ అద్భుతమైన హోమ్ రెమెడీ. పార్టీ లో అందంగా కనిపించడం కోసం పార్లర్కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెడతారు. మీరు ఒంటి మీద ఎలాంటి నగలు వేసుకున్న ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ముఖం అందంగా కనిపించక పోతే అవన్నీ వేస్ట్ అవుతాయి. ఇక పార్లర్ కి వెళ్ళి అందంగా కనిపించడం కోసం గోల్డ్ ఫేషియల్ లేదా సిల్వర్ ఫేషియల్ వంటివి చేయించుకుంటే దాదాపు 8000 వరకు ఖర్చు అవుతుంది. మీరు ఈ ఫేషియల్ అంత ఖర్చు పెట్టి చేయించుకున్న కేవలం ఆ అందం రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

మీ ముఖం లో అందం పెంచుకోవడం కోసం కేవలం స్వీట్ షాప్ లో దొరికే ఐదు రూపాయలుతో ఈ ఫేసియల్ చేసుకున్నట్లయితే నీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ముఖానికి ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందుగా ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ ఎలా వేసుకోవాలి అంటే స్క్రబ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. ఏది ఖచ్చితంగా పాటించాలి, స్క్రబ్ కోసం పుల్లటి పెరుగు కాకుండా తీయటి పెరుగును ఉపయోగించాలి. దానిలో ఒక చెంచా పంచదార వేసి బాగా కలుపుకోవాలి.

ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి. ముఖంపై పెరుగుతో స్క్రబ్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే మురికి, జిడ్డు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి తొలగించుకోవచ్చు.. ఈ స్క్రబ్ చేసుకోవడం వలన మీ ముఖం మృదువుగా తయారు అవుతుంది. ముఖ్యంగా మీ ముఖంపై ఉంటే టాన్ మొత్తం పోతుంది. అయితే మీ ముఖం పై ఉండే టాన్ పోయినట్లయితేనే ఫేషియల్ యొక్క ఫలితం బాగుంటుంది. ఈ స్క్రబ్ చేసుకున్న తరువాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగి కడుక్కొని ముఖానికి కలబంద (అలోవెరా జెల్) అప్లై చేసుకోవాలి.

ఇక అసలు విషయానికి వస్తే స్క్రబ్ చేసుకున్న తర్వాత స్వీట్ షాప్ లో దొరికే గోల్డ్ పేపర్ లేదా సిల్వర్ పేపర్ ను తెచ్చుకొని ఈ పేపర్ ను ముఖంపై మొత్తం ముఖానికి పట్టుకునే లాగా అతికించుకోవాలి. సిల్వర్ పేపర్ అతికించిన తరువాత చేతిలో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని మీ ముఖాన్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోని చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించినట్లైతే పార్లర్ కి వెల్లకుండానే మీ ముఖం అందంగా..

కాంతివంతంగా కనపడేలా చేస్తుంది. మీకు సిల్వర్ అండ్ గోల్డ్ పేపర్ ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. అయితే మీ ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే సిల్వర్ పేపర్ ను, గోల్డెన్ గ్లో కావాలి అనుకుంటే గోల్డ్ కలర్ పేపర్ ను ఉపయోగించుకోవాలి. కేవలం ఐదు రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకున్నట్లయితే గోల్డ్ ఫేషియల్ కంటే మీ ముఖం మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!