కార్తీక దీపం ప్రేక్షకులకు గుడ్ న్యూస్……రీ ఎంట్రీ ఇవ్వనున్న వంటలక్క.

ప్రేమి విశ్వనాథ్వం ఈ నటి వంటలక్క అంటే కార్తీకదీపం, కార్తీక దీపం అంటే వంటలక్క అనే విధంగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే కార్తీకదీపం లో డాక్టర్ బాబుతో ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బుల్లితెర ప్రేక్షకుల మనసును అమితంగా దోచుకుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రేమి విశ్వనాథ్వం క్యారెక్టర్ కి మహిళలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ 1200 లకు పైగా ఎపిసోడ్స్‌లో కనిపించి ఒకే సరిగా ఈ ప్రేమి విశ్వనాథ్వం ఒక్క సారిగా కనిపించక పోవడం తో వంటలక్క-డాక్టర్ బాబు అనే పాత్రలను చంపేసి విషాదంతో వారికి ముగింపు చెప్పారు.

అయితే ఈ నేపధ్యంలో అదే కార్తీకదీపంలో నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ కొత్త కథ, కథనంతో ప్రేక్షకులను టచ్ చేస్తు కథ ను ముందుకు సాగిస్తున్నారు. అయితే ఈ సీరియల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరు. అలాంటి గొప్ప ప్రాధాన్యతను సంపాదించుకున్న ఈ డైలీ మెగా సీరియల్ మిగతా సీరియల్ లకి లేని రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ డైలీ సీరియల్ లో కార్తీక దీపం అంటే వంటలక్క వంటలక్క అంటే కార్తీకదీపం అనే విధంగా ఎంతో ఫేమస్ అయింది.

అయితే వంటలక్క పాత్రలో మెరిసిన ప్రేమి విశ్వనాథ్ నటించే ఈ బుల్లితెర షో ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఈ సీరియల్ కి ఈ రెండు కారెక్టర్ లు ఒకే సారిగా దూరం అయిన క్రమంలో దారుణం గా రేటింగ్స్ తగ్గిపోవడం తో ప్రొడక్షన్ టీం తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తూ ఎట్టకేలకు వంటలక్క, డాక్టర్ బాబుల ఎంట్రీకి రంగం సిద్ధం చేశారంట.

అయితే ఈ మేరకు వంటలక్క కోమాలో ఉన్నట్లు ఓ ప్రోమో విడుదల చేయడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఈ ప్రోమోలో కోమాలో నుంచి వంటలక్క కోలుకోవడం చూపించారు. అలాగే డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ కలవరించడం కూడా చూడొచ్చు. ఫాన్స్ కి గుడ్ న్యూస్ తో దారుణ రేటింగ్స్‌తో నెట్టుకొస్తున్న కార్తీకదీపం సిరీయల్‌కు డైరెక్టర్ సరికొత్తగా ప్రాణం పోసేందుకు ప్లాన్ చేశారు.