మోకాళ్ళ నొప్పి ఇట్టే పోగొట్టే 5 రకాల సహజ మార్గాలు తెలుసా మీకు?

చిన్న పెద్ద అని వయస్సు తేడా లేకుండా అందరిలో కామన్ గా కనిపించే వ్యాధి ఏమిటి అంటే మోకాళ్ళ నోప్పులు. మోకాళ్ళ, కీళ్ల నొప్పులతో బాధపడే వారిని ఆర్థరైటిస్ అంటారు. ఈ నొప్పులని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల లేపనలను, మందులను వాడుతూ రకరకాల వ్యయామాలను చేస్తుంటారు. ఈ కీళ్ల నొప్పులనుండి త్వరగా ఉపశమనం పొండాలి అనునకునేవారు ఈ ఐదు సహజ పద్దతులను పాటించండి.

ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె: ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె రెండిటిలో ఏదో ఒక నూనె ను తీసుకొని వేడి చేసి నొప్పి ఉన్న చోట మర్ధన చేయడం వలన నొప్పి క్రమంగా తగ్గిపోతుంది.

వేడి నీటి స్నానం: గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీనివలన కీళ్ల పటుత్వం పెరిగి, క్రమ క్రమంగా కీళ్ల నోప్పులు తగ్గుతాయి.

ఐస్ ముక్కల మర్ధన: కీళ్ల నోప్పులు ఉన్న చోట ఐస్ ముక్కను నొప్పి ఉన్న దగ్గర చుట్టడం వలన నొప్పి నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. మొదట కొంత అసౌకర్యంగా అనిపించిన క్రమంగా నొప్పలు తగ్గుతాయి.

పసుపు పొడి: పాలల్లో చిటికెడు పసుపు వేసకొని తాగడం వలన కూడా కీళ్ల నొప్పులనుండి బయట పడవచ్చు. పసుపు లోని కర్కుమిన్ రోగ నిరోధక శక్తి పెంచి కీళ్ల నొప్పులనుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

శరీర బరువు తగ్గించుకోవడం: చాలా మంది ఈ రోజుల్లో ఊబకాయం తో బాధపడుతున్నారు, వారి అధిక బరువే వారి కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేయడం వలన అధిక బరువు తగ్గించుకోవచ్చు.