మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలి అంటే ఈ చిన్న పని చేయండి. మీ ఆర్థిక సమస్యలు దూరం చేస్కోండి.

కొంత మంది సంపాదన చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సంపాదన కొద్ది సమస్యలు వస్తూనే ఉంటాయి. మీరు ఎంత కష్టపడిన ఫలితం లేదు అని భాదపడకండి.

అయితే మీరు సంపాదించే సంపాదన మీ ఇంట్లో నిలవాలి అంటే ఈ చిన్న పని చేయండి. మీ ఆర్థిక సమస్యల నుండి ఎలా బయట పడండి. మీ ఇంట్లో లక్ష్మీ దేవి నిలవాలంటే శుక్రవారం నాడు కానీ , మంగళవారం నాడు కానీ ఏదో ఒక రోజు మీ ఇంటికి ఒక మట్టి కుండ తీసుకురండి.

అలా తెచ్చుకున్న మట్టికుండను కడిగి తడి లేకుండా అరనివ్వాలి, దాని పై ఒక x మార్క్ వేసుకొని ఉంచండి. ఆ కుండలో ఆదివారం కానీ మంగళవారం కానీ సగం వరకు ఉప్పు పోసి దానిని పేపర్ తో కప్పి ఉంచండి. ఇక మీకు వచ్చిన జీతం ను ఆ కుండలో కొంచెం పెట్టి రాత్రి అంతా దేవుడు గదిలో ఒక మూలన ఉంచండి.

ఈ విధంగా మీ సంపాదనను ఒక మూడు నెలల పాటు చేయండి. డబ్బులు చేతులు మారుతూ వస్తాయి వాటికి కూడా కొంత నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉప్పు వాటిలోని చెడును పోగొడుతుంది. నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేస్కొని లక్ష్మీదేవి ని మీ ఇంట నిలుపుకోండి.