మద్యం ప్రియులకు బ్రేకింగ్ న్యూస్…. ఈ రెండు రోజులు లిక్కర్ బంద్.

జంట నగరాల్లో రెండు రోజులు మద్యం షాప్ లు బంద్ ఉండటం తో మద్యం ప్రియులు లిక్కర్ షాప్ ల చుట్టూ బారులు తీరారు. హోలీ పండుగ సందర్బంగా తెలంగాణ పోలీస్ శాఖ వారు నగర పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

జంట నగరాల్లో 48 గంటల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి అని, ఈ రోజు సాయంత్రం 17వ తేదీ గురువారం సాయంత్రం 6 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 6 వరకు బార్లు, వైన్స్, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.

నగరంలో తిరిగే వాహనదారులపై ఎటువంటి రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. వాహనాలపై తిరుగుతూ రోడ్ల పై ఎక్కువ గుంపులు గుంపులుగా తిరుగుతూ అల్లరి చేయరాదని సూచించారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమలు లో ఉంటాయి అని చెప్పారు.