మీ లివర్ ని ఈ విధంగా క్లీన్ చేశారా? అయితే మీరు రమ్మన్నా జీవితంలో మీకు ఎలాంటి జబ్బులు రావు.

మీ లివర్ ని ఈ విధంగా క్లీన్ చేశారా? అయితే మీరు రమ్మన్నా జీవితంలో మీకు ఎలాంటి జబ్బులు రావు.

కాలేయం శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలో కాలేయం 500 వందల పైగా పనులను చేస్తుంది. ఇక ఆ అవయవం దెబ్బతింటే భయంకరమైన వ్యాధులు వస్తాయి. కాలేయం దెబ్బతినడానికి ముఖ్యకారణాలు ఎంటో మీకు తెలుసా? అవును మీరు చేసే ఈ చిన్న తప్పులే మీ కాలేయం ని త్వరగా పాడు చేస్తాయి. అయితే జ్వరం, జలుబు రాగానే మీరు డాక్టర్ సలహా లేకుండా చిన్న చిన్న వాటికి చాలా మందులు వాడేస్తుంటారు.

ఇంకో కారణం ఏంటి అంటే మద్యంతాగడం, మరికొంత మంది ఎప్పుడు బయట జంక్ ఫుడ్ తీసుకోవడం,పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కాలేయం మీద గట్టి ప్రభావం చూపిస్తాయి. కాలేయం యొక్క ఆరోగ్యం విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే మన జీర్ణవ్యవస్థలో కీలక మార్పులు వచ్చి శరీర వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.

వంటింట్లో దొరికే వస్తువులతో కాలేయం ఎలా క్లీన్ చేస్కోవాలో చూద్దాం:

  1. సొరకాయ
  2. కొత్తిమీర
  3. నిమ్మకాయ
  4. నల్ల ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు
  5. పసుపు

తయారీ విధానం:

సొరకాయ, గుప్పెడు కొత్తిమీరలో కొంచెం నీరు కలిపి మిక్సీ పట్టి జ్యూస్ లాగా తయారు చేయాలి. దానిలో చిటకెడు పసుపు వేసుకోవాలి. రుచి కి సరిపడా ఉప్పు మరియు అరచెక్క నిమ్మ రసం కూడా వేసుకొని జ్యూస్ ని తయారు చేసుకోవాలి. లివర్ ని క్లీన్ చేసే అద్భుతమైన హోమ్ రెమెడీ రెఢీ. సొరకాయ అంటే చాలా మంది ఇష్టపడరు. సొరకాయ లో కాల్షియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ సి, బీ కాంప్లెక్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఆహరం జీర్ణంకావడంలో సహాయపడి యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. సొరకాయ జ్యూస్ లివర్లో వాపును తగ్గిస్తుంది. పసుపు మంచి యాంటీబయోటిక్గా పనిచేసి శరీరం మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఇవే కాకుండా కిస్మిస్ ని నీటిలో మరగబెట్టి తాగినా కూడా కాలేయం శుభ్రపడుతుంది. గ్రీన్ టీ, ఆపిల్ సిడార్ వెనిగర్ కూడా నాచురల్ గా లివర్ ను శుభ్రపరుస్తాయి.అయితే వారంలో ఒకసారైనా పాలకూర, బీట్రూట్ కివీ,ఆరెంజ్ వంటి విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవడంవలన లివర్ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!