అరటి పండు అంటే అందరికీ తెల్సిన ఆరోగ్యకరమైన న్యూట్రీషనల్ ఫుడ్. అరటి పండు ఒక్కటే మనకు ప్రయోజనం చేయదు, ఆ చెట్టు లో ప్రతి భాగం మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే అరటి పండు, అరటి దూట, అరటి పువ్వు ఇలా అన్నీ రకాలు గాను ఉపయోగపడుతుంది. వీటన్నింటి లో కెల్లా మన రెగ్యులర్ డైట్ లో ఉండేది అరటి పండ్లు. అరటి పండ్లలోను కాదు అరటి చెట్టు యొక్క పువ్వులోనూ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణ ఆసియాలో అరటి పువ్వును హెల్తీ వెజిటబుల్ గా తీసుకుంటారు. దీన్ని పచ్చిగా లేదా ఉడికించి రెగ్యులర్ డైట్ గా తీసుకుంటారు. (nswhealth)
ఇంకా సూప్స్, కర్రీస్,ఫ్రైడ్ ఫుడ్స్ రూపంలో తీసుకుంటారు. అరటి పువ్వులో శరీరానికి కావాల్సిన న్యూట్రిన్స్ చాలా బాగా లభిస్తాయి. 100 గ్రాముల అరటి పువ్వులో 51కాలరీ లు, 1.6 గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే 0.6 ఫ్యాట్, 0.9 కార్బోహైడ్రేట్ లు, 5.7 ఫైబర్, 56 మిల్లీ గ్రాముల కాల్షియం, 73 మిల్లీ గ్రాముల ఫాస్పోరస్, 56.4 మిల్లీ గ్రాముల ఐరన్, 13 మిల్లీ గ్రాముల కాపర్, 553.3 మిల్లీ గ్రాముల పొటాషియం , ఇంకా మెగ్నీషియం లాంటి విటమిన్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని రకాల పోషక విలువలు కలిగిన ఈ అరటి పువ్వు మనకు ఇంకా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. (nswhealth)
అరటి పువ్వును, బాణాన హార్ట్స్ అంటారు. ఇది చూడటానికి హార్ట్ రూపంలో ఉంటుంది. అరటి పువ్వు ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది.మూత్ర పిండాల సమస్య తో భాదపడే వారు, మూత్ర పిండాలో ఏర్పడిన రాళ్ళ సమస్య ను తగ్గించడంలో అరటి పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మగవారికి ఈ పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీ*ర్య కణాల సమస్య తో బాధపడే వారు ఈ అరటి పువ్వును ఆహరం లో భాగంగా చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి. (nswhealth)