మోదుగు పూలతో ఆరోగ్యవంతమైన నూరేళ్ళ జీవితం మీ సొంతం !!

మోదుగు పూల తో మృత్యుంజయులు, మోదుగు పూలతో ఆరోగ్యవంతమైన నూరేళ్ళ జీవితం మీ సొంతం !!ఆకులు బెరడు పువ్వులు కాయలు వీటిని వీటిని సరైన మోతాదులో తీసుకొని చూర్ణం లో తయారు చేసుకోవాలి,
ముందుగా ఉదరాన్ని ఖాళీ చేసుకోవాలి.


ఉదయాన్నే పరగడుపున ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉండడం వలన సర్వ వ్యాధులు సంహారమై మృత్యుంజయులు అవుతారు.

ఈ చెట్టు వేర్లను సానరాయి పై మెత్తగా పేస్టులా చేసుకుని రోజు ముక్కులోనాలుగు చుక్కలు వేసుకోవడం వల్ల మూర్ఛ రోగం కూడా తగ్గుతుంది.

రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో మోదుగు పూల ను వేసి నానబెట్టుకోవాలి పరిగడుపున కలకండ కలిపి సేవిస్తూ ఉండడం వలన యూరినరీ సమస్య కూడా తగ్గుతుంది.

హోలీ సమయంలో ఈ పూలను ఉడకబెట్టి రసం తీసి ఎలాంటి కెమికల్ లేని ఈ రసాన్ని హోలీ గా ఉపయోగించుకోవచ్చు.

మోదుగ ఆకులలో భోజనం చేయడం వలన వాత రోగాలు కఫ రోగాలు గడ్డలు, రక్తంలో వేడి నివారించవచ్చు,డయాబెటిస్ రోగులు ఈ ఆకుల పొడిని తరచూ వాడడం వలన షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

ఈ పువ్వులు ఆరోగ్య విషయానికే కాకుండా భక్తి పరంగా కూడా ఆ మహాదేవుడు శివునికి ఎంతో ప్రీతికరమైనవి గా చెప్పవచ్చు.