ఇలాంటి పగ ఎక్కడ చూసిఉండరు. మరిన్ని వివరాలకు ఈ స్టోరీ చూడండి.

మనిషికి మనిషికి మధ్య పగ చూసే ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఆ పగ అనే మాట వినడం తగ్గింది కదా, ఎందుకు అంటే ఎవ్వరి బిజీ లైఫ్ వాళ్ళది. కానీ ఎక్కడ ఒక వింతైన పగ మొదలయింది. అది ఎంతో తెల్సుకోవాలని ఉందా? అయితే అస్సలు ఏం జరినగదో చూద్దాం.

కొన్ని రోజుల క్రితం కొన్ని కుక్కలు కలిసి ఒక కోతి పిల్లను వెంటాడి చంపాయి. ఈ విషయాన్ని పక్క ప్లాన్ గా మార్చుకున్న కోతులు పగ పట్టిన వారు ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో అదే విధంగా కుక్క పిల్లలను చంపడం మొదలు పెట్టాయి. ఏకంగా 250 కుక్కలను వెంటాడి చంపాయి.

ఈ వింతైన ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌లో జరిగింది. కుక్కలను ఏ విధంగా చంపేవి అంటే చిన్న కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్‌ లేదా చెట్ల మీద నుంచి చచ్చేలా విసిరికొట్టడం,పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయన్నాయి అని గ్రామస్తులు చెప్పారు.

ఆ గ్రామంలో ఒక్క కుక్క కనిపించక పోవడంతో గ్రామస్తులు అటవీ శాఖ కు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు. క్రమ క్రమంగా కోతులు మనుషులపై కూడా దాడి చేసుతన్నాయి అని చెప్పారు.