మల బద్దకం మిమ్మల్ని వేదిస్తుందా? ఈ చిన్న చిట్కా పాటించండి.

అన్నీ సమస్యలతో పాటు ఈ మధ్యకాలం లో అందరినీ వేదిస్తున్న సమస్య మల బద్దకం. మనిషి మలం సరిగా బయటకి విసర్జన జరగకపోతే ఎన్నో రకాల వ్యాధులు శరీరంలో ఉత్పన్నమవుతాయి. ఈ సమస్య గర్భిణీ స్త్రీలలో మరియు వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనబడుతుంది.

కొంత మంది ఈ సమస్యను చిన్నదిగా చూస్తారు… ఖచ్చితంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని ఈ సమస్యను నివారించుకోవాల్సిన అవరసం చాలనే ఉంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేకాదు తాజా పండ్లతో ఈ మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.

తాజా పండ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణాశయ మార్గాన్ని శుభ్రం గా ఉంచడంతో పాటు విరోచనం కూడా తేలిక అయ్యేలాగా చేస్తుంది. కొవ్వులను అదుపులో ఉంచడానికి కూడా దోహద పడతాయి తాజా పండ్లు. మనం ఉపయోగించే అన్ని రకాల ధాన్యాల పొట్టులో కూడా పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే పొట్టుతీయని ధాన్యాలు ను ఎక్కువగా తీసుకోవాలి.మలబద్దకం సమస్యను నివారిచుకోవాలి అంటే విరోచనం చాలా సులువుగా అయ్యేలా చూసుకోవాలి… విరోచనం సులువుగా అవ్వాలి అంటే తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

తాజా పండ్లను తీసుకోవడం వలన కూడా మలబద్దకం సమస్యను అతీసులువుగా తగ్గించుకోవచ్చు.మనము రోజు తీసుకునే ఆహార ధాన్యాలపై ఉండే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రోజువారి ఆహరంలో పొట్టు తో ఉండే ఆహారాలను తీసుకోవడం వలన కూడా ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు.

చిక్కుడు గింజల్లో కూడా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా లభిస్తాయి. పీచు పదార్థం ఉన్న ఆహరాధాన్యలే కాకుండా శరీరానికి సరిపడా నీరు తీసుకోవడం వలన కూడా మల బద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. మొలకెత్తిన ధాన్యాలలో , ఆకుకూరల్లో , కాయకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.