మీ జుట్టు లో చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరిగే అద్భుత రెమెడీ.

ఈ రోజుల్లో చాలా మంది చుండ్రు మరియు జుట్టు రాలే సమస్య తో సమస్య తో బాధపడుతున్నారు. ఈ చుండ్రు తగ్గి జుట్టు రాలే సమస్యను తగ్గించుకునే అద్భుత రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

రెమెడీ కి కావాల్సిన పదార్థాలు:

  1. సబ్జా గింజలు
  2. కొబ్బరి ముక్కలు
  3. ఉల్లిపాయ ముక్కలు

ముందుగా ఒక స్పూన్ సబ్జా గింజలను తీసుకొని వాటిని నానబెట్టుకోవాలి. కొబ్బరి ని చిన్న ముక్కలు గా చేసుకొని పొడి చేసుకొని వాటిని పలు గా తయారు చేసుకొని పెట్టుకోవాలి.

వాటితో పాటుగా ఉల్లి ముక్కలను చేర్చి ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని తలకు పట్టించుకోవాలి.

ఈ విధంగా తలకు పట్టించిన మిశ్రమాన్ని అరగంట తరువాత రెగ్యులర్ గా చేసే షాంపూ తో తల స్నానం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒక సారి చేయడం వలన మీ జుట్టు లో చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.