ఒక్కసారి పుల్కాలు ఇలా చేసి  చూడండి.

ఒక్కసారి పుల్కాలు ఇలా చేసి చూడండి.

NATURAL HEALTHY PULKA: మనం పుల్కాలు చేసుకునేటప్పుడు పిండి కలిపేటప్పుడు నీరు పోస్తాము కానీ నీళ్ల బదులు తోటకూర రసం పిండిలో కలిపి పుల్కాలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే రుచిగాను ఉంటుంది తోటకూర ఆకుకూరలలో అన్నిటికన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది తోటకూర తింటే చాలా మంచిది మరియు ఇది ఏ కాలంలోనైనా ఎక్కడైనా దొరుకుతుంది.

100 గ్రాముల తోటకూరలో 430 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది అంటే పాల కన్నా, మూడు రెట్లు ఎక్కువ. తోటకూరలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అలాగే 100 గ్రాముల తోటకూరలో 39 గ్రాముల ఐరన్ ఉంటుంది. మనకి రోజుకు 30 గ్రాముల ఐరన్ అవసరం. అలాగే విటమిన్ ఏ అండ్ బి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు, క్యాల్షియం, సోడియం, ఐరన్, ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు తోటకూరల్లో ఎక్కువగా లభిస్తాయి.

అందుకే మార్కెట్ కి వెళ్ళినప్పుడు తోటకూరను కచ్చితంగా కొనాలి. తోటకూరను ఆకులుగా గిల్లి, కాడలు, కట్ చేసి మిక్సీ పట్టి ,జ్యూస్ లాగా చేసుకోవాలి. అంతా తీసేసి స్వచ్ఛమైన జ్యూస్ ను పుల్కాపిండిలో కలిపి చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో రకాల విలువలు అందజేసుకో గలుగుతాం. అందుకే ఆకు కూరల్లో తోటకూర చాలా మంచిది. పెద్దలకు, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉన్న వారికి కూడా తోటకూర చాలా మంచిది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3qhS7vL

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *