అంతా షాక్…..అసలైన నిజం ఏమిటి అంటే…..!

కరోనా సంక్షోభం దేశాన్ని మరో విపత్తుకి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ రోగులు చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, ఔషధాల కొరత పెరుగుతోంది. ఈ కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. దేశంలో కరోనా రోగులకు తీవ్రమైన ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అవ్వే అని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. గుండెలు బాదుకుంటున్నారు. అంతా ఆ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు. అయ్యో ఎంత కష్టం వచ్చిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు.Old woman with oxygen sylinder sit on the Road

Alsoread: అందరి ప్రాణాలను కాపాడుతున్న “ఆక్సిజన్ మ్యాన్ “.

వాస్తవం ఏంటంటే.. ఆ అవ్వ కరోనా పేషెంట్ కాదని తేలింది. ఆ అవ్వ నిజమే. ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డుపైన కూలబడటమూ నిజమే. కానీ, కరోనా పేషెంట్ మాత్రం కానే కాదు. నిజానికి ఆ ఫొటో ఇప్పటిది కాదు. మూడేళ్ల క్రితం(2018) నాటిది. అసలప్పుడు కరోనానే లేదు. ఓ మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా.. కొడుకు అంబులెన్స్ కోసం వెళ్లగా.. తల్లిని అలా కూర్చోబెట్టాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో ఆ అవ్వ కూర్చుని ఉంది.ఇది నిజమేనేమో అని ఆ ఫొటోని షేర్ చేసి తమ సానుభూతి తెలుపుతున్నారు. వాస్తవానికి ఆ ఫొటోతో జనాలను తప్పుదోవ పట్టించారు.Old woman with oxygen sylinder sit on the Road

Alsoread: ఎస్బీఐ (state bank of india) అకౌంట్ వాడుతున్నార ఐతే ఈ వీడియో చూడండి.