కరోనా పాజిటివ్ వచ్చింది అని మీకు తెలిస్తే? ఏం చేయాలి? ఏం చేయకూడదు?

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. అత్యదిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.రోజు రోజు కు కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారందరికి ట్రీట్ మెంట్ ఇవ్వడం అంత ఈజీగా కాదు. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వైర‌స్ సోకిన చాలా మంది హోమ్ ఐసోలేష‌న్ ఉండాల‌ని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే అస‌లు చాలా మందికి ఇంట్లో ఉండేట‌ప్పుడు ఏం చేయాలో స్పష్టమైన అవ‌గాహ‌న ఉండ‌టం లేదు.ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Precautions for covid cases-entertainmentdessert.com

Alsoread: కరోనా పేషెంట్స్ కి అద్భుత వరంగా మారిన ఈ పరికరం.

ఏం చేయకూడదు…
కరోనా వైరస్ వచ్చిందని తేలికపాటి లక్షణాలు ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్, రెమ్ డెసివిర్ తీసుకోవద్దు. మిలొ ఆక్సిజన్ స్థాయి 94కు తగ్గినా, బ్రీతింగ్ సమస్య ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గూగుల్ లో వెతికి మందులు తీసుకోవద్దు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఇంట్లో చికిత్స వద్దు. వెంటనే హాస్పిటల్కు వెళ్ళండి. వాడిన మాస్కు లను తిరిగి వాడకూడదు.. ఇక మాస్క్ లేకుండా ఇంట్లో అస్సలు తిరగవద్దు. Precautions for covid cases-entertainmentdessert.com

Alsoread:కరోనా వ్యాక్సిన్ కావాలా అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

ఏం చేయాలి….
బాగా వెలుతురు, గాలి వ‌చ్చే గ‌దిలో క‌రోనావైర‌స్ సోకిన‌వారిని ఉంచాలి. వారికి ఉప‌యోగించే మ‌రుగుదొడ్డిని వేరెవ‌రూ వాడ‌కూడ‌దు. రోగుల‌ను చూసుకోవ‌డానికి ఒక స‌హాయ‌కుడు వారికి ఎప్పుడూ అందుబాటు ఉండాలి. నీళ్లు ఎక్కువ‌గా తాగాలి. గోరు వెచ్చటి నీరు మంచిది. గ‌ది నుంచి బ‌య‌ట‌కు వస్తే మాస్క్ ధ‌రించ‌డం తప్పనిసరి. ద‌గ్గే ట‌ప్పుడు లేదా తుమ్మే ట‌ప్పుడు హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా టిష్యూ ఎప్పుడూ ఉప‌యోగించాలి. వాడిన క‌ర్చీఫ్‌, టిష్యూ, దుస్తులను గాలి చొర‌బ‌డ‌లేని క‌వ‌ర్లు, చెత్త బుట్టల్లో వేయాలి. వీలైతే ఇంటి బ‌య‌ట వీటిని కాల్చేయాలి. ఇత‌ర చెత్తతో వీటిని క‌ల‌ప‌కూడ‌దు. మ‌రుగుదొడ్డికి వెళ్లే ముందు, వెళ్లిన త‌ర్వాత చేతులను 40 నుంచి 60 సెకన్ల పాటు క‌డుక్కోవాలి. త‌డి చేతుల్ని తుడుచుకోవ‌డానికి క్లాత్ ఉప‌యోగించొద్దు

Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *