ప్రతి రోజు ఈ వస్తువులు వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా చూడండి.

ప్రతి రోజు ఈ వస్తువులు వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా చూడండి.

క్యాన్సర్ సమస్య ఈ రోజుల్లో అందరికీ వచ్చే సాధారణ వ్యాధి లాగా మారిపోయింది. దాదాపు చాలా మంది క్యాన్సర్ అనే వ్యాధి తోనే బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి అనేది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చి వారి ఇంటిల్లి పాదిని చాలా ఇబ్బందులు పెడుతుంది. ఏది ఏమైనా ఈ క్యాన్సర్ రావడానికి కారణం దాదాపు మనం తినే ఆహరమే కారణం అవుతుంది. అయితే మనం తినే ఆహారాలలో ఏవేవి క్యాన్సర్ ప్రేరకాలుగా ఉన్నాయి. మొదటగా క్యాన్సర్ కారకం తినే ఆహారాన్ని పాలిథిన్ కవర్లలలో ప్యాక్ చేసిపెట్టడం అని చెప్పవచ్చు. . ఇక పాకెట్ ఫుడ్ ని చిన్నపిల్లలు దగ్గర నుండి పెద్దవారు దాకా ఇష్ట పడి మరి తింటున్నారు.

దాదాపు మనం వాడే పాకెట్ పదార్థాలు అనగా మైదా, వైట్ షుగర్,కాన్ ఫ్లోర్ ఇలా చెప్పుకుంటే ప్రతిదీ ఈ రోజుల్లో పాకెట్ లలోనే అందరికీ అందుబాటులో ఉంటున్నవి. ప్రస్తుత ప్రపంచంలో ఎటు చూసిన ప్లాస్టిక్ మయం. చివరకు రోజు వాడే మంచినూనె కూడా ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాక్ చేస్తున్నారు. ఇక జంక్ అలవాటు ఉన్నవారిని చూస్తే వీరిలో కూడా చాలా మంది ఈ క్యాన్సర్ భారీన పడుతున్నారు. అయితే ఈ ప్యాకెట్ ఫుడ్స్ అన్నిటినిలో కలర్స్, ఫ్లేవర్స్ అనే వాటిని ఎక్కువగా కలుపుతున్నారు. ఈ ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా హై ఫ్యాట్, హై కార్డ్స్ ఉండడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది.

ఈ కారణం చేత మన శరీరంలో ఉండే DNA అనేది డామేజ్ అవుతుంది. ఈ ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల మంచి పోషకాలు లభించక పోగా ముఖ్యంగా క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. ఇక రెండవది నూనెలో దేవిన ఆహారాలు. ఆ ఆహార పదార్థాలు ఏమిటి అంటే నూనెలో డీప్ ఫ్రై చేసినవి, వేపుళ్ళు, కూరలు లాంటివి. అతి వేడి కి గురైనవి కూడా వీటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి నేరుగా ఆహారం ద్వారా లోపలికి వెళ్లి మన శరీరంలో కణజాలాన్ని DNA ని డామేజ్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ తెల్ల రక్త కణాల మీద దాడి చేసి వాటిని బలహీనం చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మూడవది హై సాల్ట్ ఫుడ్స్ తినడం.

ఎక్కువ ఉండే నిలవ పచ్చళ్ళు, పులుసులు, రసము ఇలాంటి సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం ద్వారా ఈ సాల్ట్ ఎక్కువగా శరీరం లోకి వెళ్లడం వల్ల స్ట్రెస్ ని ఎక్కువగా పెంచుతుంది. ఇక నాలుగవది లో మైక్రో న్యూట్రియన్స్ ఫుడ్ తినడం. అంటే ఆహారాల్లో పోషకాలు లేని విధంగా తయారు చేసుకొని తినడం. కూరగాయలను నున్నగా చెక్కుకొని వండుకోవడం వల్ల సూక్ష్మమైన పోషకాలు తొక్కల్లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ పోతాయి కట్ చేసి ఫ్రిజ్లో రెండు మూడు రోజులు పెట్టి వండుకోవడం ఇవన్నీ సూక్ష్మమైన పోషకాలను పోయే విధంగా చేస్తాయి. ఆల్కహాల్ లాంటివి కూడా ఎక్కువ క్యాన్సర్ ప్రేరకాలు అని చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి దూరం గా ఉండి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!