తెలంగాణ లో ఆర్టీసి ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఆర్టీసి.

ఆర్టీసి ఉద్యోగులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసి….తెలంగాణ ఆర్టీసి ఎండీ సజ్జనార్ క్షేత్ర స్థాయిలో పర్యటించినపుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇస్తే ఉద్యోగులు స్వచ్చందంగా రాజీనామా చేస్తామని ముందుకు వచ్చారని చెప్పారు.

ఆర్టీసి లో స్వచ్చంద ఉద్యోగ విరమణ వలన ఆర్టీసి పై కొంత భారం తగ్గుతుంది అని చెప్పారు. ఆర్టీసి కార్మికులు ఇప్పటివరకు వి.ఆర్.ఎస్ 2 వేల మంది ముందుకు వచ్చారని.. వారు వి.ఆర్.ఎస్ పై సంతకాలు కూడా చేశారని ఆర్టీసి ఎండీ స్పష్టం చేశారు.

ఇప్పటివరకు సంస్థ ఆదాయంలో 46 శాతం జీతాలకే పోతుంది అని, ప్రస్తుతం సంస్థ కు 65 నుండి 68 శాతం ఆక్యూపెన్సీ వస్తుంది అని చెప్పారు. ఈ ఆక్యూపెన్సీ ని 75 నుండి 80 శాతానికి పెంచితె ఆదాయం పెరుగుతుంది అని చెప్పారు.

ఆర్టీసి లో కొత్త బస్ లు కొనాలని నిర్ణయం తీసుకున్నట్లు గా, డీజిల్ ధరలు పెరగడం వలన సంస్థపై భారం పడుతుంది అని ఎండీ సజ్జనార్ తెలిపారు.