నువ్వుల పాల గురించి మీకు తెలుసా? అవి ఆరోగ్యానికి ఎంత బలమో తెలుసా?

ఈ ప్రపంచంలో ఆవులు, గేదెలు గురించి తెలియని వ్యక్తి అసలు ఉండరు. పొద్దునే లేవగానే చంటి బిడ్డ నుండి పెద్ద వారి వరకు కావాల్సినవి పాలు, పాలతో టీ చేస్కొని తాగే వారు ఉన్నారు. మరికొంత మంది పాలను నేరుగా తీసుకోకుండా మజ్జిగ, పెరుగు, నెయ్యి ఇలా రకరకాలు గా తీసుకుంటారు.

శరీరానికి ఎన్నో పోషకాలను అందించడంలో పాలు పాత్ర ను వహిస్తాయి. అయితే పాలు సంపూర్ణ పౌష్టిక ఆహారం, కానీ కొంత మంది పాలను నేరుగా తాగలేక ఇబ్బంది పడుతుంటారు. నువ్వుల తో తయారు చేసిన పాలను తాగడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది.

ALSO READ: అల్లం టీ శరీరానికి ఎంత మంచిదో తెలుసా మీకు?అయితే ఖచ్చితంగా ఇది చూడండి.

నువ్వు తో పాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము:

నువ్వులని ఒక వంద గ్రాముల తీస్కొని, నువ్వులను 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న నువ్వులను నీళ్ళ తో తడుపుతు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొన్న పేస్ట్ నుండి కొద్ది కొద్ది ఒక శుభ్రమైన వస్త్రంలో ఉంచి బాగా పిండాలి, దాని నుండి తెల్లని పాలు వస్తాయి. ఈ విధంగా మొత్తం పేస్ట్ నుండి మనకు సరిపడా పాలు తీసుకోవాలి.

నువ్వుల నుండి తీసిన పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు వాటిని నేరుగా కూడా తాగవచ్చు. నువ్వుల పాలు తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పశువుల పాలల్లో లభించే కాల్షియం కు సమానమైన కాల్షియం లభిస్తుంది. పశువుల పాలు తాగడం ఇబ్బంది పడే వారు నువ్వుల పాలను మంచిగా తాగవచ్చు.

ALSO READ: మహిళలో గర్భాశయ కాన్సర్ నిరోధించడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

నువ్వుల లో ఫైబర్ అధికంగా లభిస్తుంది కాబట్టి మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గుతాయి. శరీరానికి సరిపడా కాల్షియం లభించడం వలన దంతాలు, ఎముకలు ధృడంగా తయారు అవుతాయి. నూవుల పాలు ప్రతి రోజు ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవడం వలన గుండె సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించడం లోనూ, డయాబెటిస్ అదుపులో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి.

ALSO READ: మహిళలో గర్భాశయ కాన్సర్ నిరోధించడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ALSO READ: అల్లం టీ శరీరానికి ఎంత మంచిదో తెలుసా మీకు?అయితే ఖచ్చితంగా ఇది చూడండి.

ALSO READ: పుదీనా టీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

ALSO READ: వేసవిలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా మీకు?

ALSO READ: మల బద్దకం మిమ్మల్ని వేదిస్తుందా? ఈ చిన్న చిట్కా పాటించండి.