ప్రతి రోజు శొంఠి తీసుకోవడం వలన కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.

ప్రతి రోజు శొంఠి తీసుకోవడం వలన కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.

శొంఠి అంటే తెలియని గృహిణి ఉండదు. అయితే శొంఠి ని ఎలా తయారు చేస్తారు అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. పచ్చి అల్లం ని ఎండబెడితే దానినే శొంఠి అంటారు. శొంఠి శరీరానికి చాలా మంచి చేస్తుంది. పచ్చి అల్లం ని రోజు వండే వంటలలో ఏదో ఒక రూపంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లా గా ఉపయోగిస్తుంటాము. చాలా మంది ఇంట్లో చాయి(టీ) లో కూడా అల్లం ని వేస్తుంటారు. ఆయుర్వేదంలో శొంఠి కి మంచి ప్రాముఖ్యత ఉంది అని చెప్పవచ్చు.

శొంఠి రోజు తీసుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం:

  1. రోజు ఒక గ్రాము శొంఠి పొడిని నీటిలో కలుపుకొని తాగడం వలన మహిళలకు ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పి నుండి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.
  2. శరీరంలో కీళ్ల, వేళ్ళ నొప్పులు మరియు వాపు లాంటి వాటితో బాధపడే వారు శొంఠి ని తీసుకోవడం వలన నొప్పులనుండి బయటపడవచ్చు.
  3. పరిగడుపునే రెండు గ్రాముల శొంఠి పొడిని మరియు ఒక చిటికెడు ఉప్పును ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వలన షుగర్ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు.
  4. మలబద్దకం, అజీర్ణం, ఉదర సమస్యలతో బాధపడే వారు భోజనానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో రెండు గ్రాముల శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వలన ఈ సమస్యలను నుండి బయటపడొచ్చు.
  5. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికీ శొంఠి కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *